/rtv/media/media_files/2025/02/18/6Vy5qe6LRLfo7gfzpkkY.jpg)
boat journey to kumbh mela Photograph: (boat journey to kumbh mela)
Kumbh Mela Viral News: ఉత్తరప్రదేశ్(UP)లో కుంభమేళా సమయం దగ్గర పడతుండటంలో ప్రయాగ్‌రాజ్(Prayagraj) వెళ్లేవారి సంఖ్య అంతకంతా పెరుగుతుంది. దీంతో సందర్శకులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. గంటలు గంటలు రోడ్లపై వెయిట్ చేయాల్సి వస్తోంది. కుంభమేళాకు ట్రాఫిక్ లేకుండా చేరుకొవడానికి ఓ వ్యక్తి వినత్నంగా ఆలోచించాడు. ఫిబ్రవరి 8, 9 రోజుల్లో ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్‌లో రోడ్లపై ట్రాఫిక్‌ను చూసి వీరు అలా అయితే కుంభమేళా వెళ్లలేమనుకున్నారు. రైళ్లలో కూడా రద్దీ ఇంచుమించు అలానే ఉంది.
Also Read: మలైకా అరోరాకి ఇష్టమైన జ్యూస్ ఇదే.. అది ఎలా తయారు చేయాలో తెలుసా..
7 young man from kamariya village in Bihar, Buxar district found an unconventional way to reach the destination of prayagraj Kumbh, they used motorised boat. Journey was roughly 550 km 84 hours round trip journey. They took gas cylinder stove,basic food supplies and extra engine… pic.twitter.com/2ANKqNNLip
— Abhay Singh (IIT BOMBAY) (@Abhay245456) February 17, 2025
550 కిలో మీటర్లు గంగానదిలో ప్రయాణం..
బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ 550 కిలో మీటర్లు గంగానదిలో ప్రయాణం చేశారు. బీహార్‌లోని బక్సర్‌కు చెందిన ఏడుగురు వ్యక్తుల కలిసి ఈ సాహస యాత్ర చేశారు. వీరు ఫిబ్రవరి 11న బక్సర్ నుండి బయలుదేరి ఫిబ్రవరి 13న తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని సంగంలో పవిత్ర స్నానం ఆచరించారు. కేవలం రెండు రోజుల్లోనే వారు 550 కిలో మీటర్లు గంగా నదిలో ప్రయాణించారు. ప్రయాణ ఖర్చులు మొత్తం 20 వేలు అయ్యాయని యాత్రికులు చెబుతున్నారు.
Also Read : నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్ రాయల్ సంచలన ఆడియో!
మోటర్‌తో నడిచే బోట్‌ను ఉపయోగించారు. అనుకోని సంఘటనల వల్ల ఒక మోటర్ ఫెయిల్ అయితే సేఫ్టీ కోసం రెండు మోటర్లు పడవకు అమర్చారు. మోటర్ వేడిక్కడం వల్ల అప్పుడప్పుడు దాదాపు 5 కిలో మీటర్ల దూరం తెడ్డులతో పడవ నడిపామని వారు చెప్పారు. అంతేకాదు విశ్రాంతి లేకుండా రాత్రి పగలు పగవ ప్రయాణం చేశమని చెప్పారు. వారు షిఫ్టుల వారీగా వారి బోట్ నడిపారు. ప్రస్తుతం వీరి బోట్ జర్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
Also Read: దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!