/rtv/media/media_files/2025/02/21/1LxngLuM0Eg4ubDbPQ6u.jpg)
Delhi BJP Government
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం వచ్చేసింది. ఆప్ పోయి బీజేపీ వచ్చింది. కొత్త ముఖ్యమంత్రి, కొత్త మంత్రులు...మొత్తం ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈమెతో పాటూ ఆరుగురు మంత్రులూ ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత మంత్రుల శాఖల కేటాయింపుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇందులో ఆర్థిక, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, సమాచార ప్రసారాల శాఖలను సీఎం రేఖా గుప్తా తన వద్దనే ఉంచుకున్నారు.
Also Read : తాజ్‌బంజారా హోటల్ సీజ్
శాఖల కేటాయింపులివే..
పార్టీ సీనియర్ నేత ఆశీస్ సూద్‌కు హోం, విద్య, విద్యుత్, పట్టణాభివృద్ధి శాఖలను అప్పగించారు.
పర్వేశ్ సింగ్‌కు శాసనసభ వ్యవహారాలు, పబ్లిక్ వర్క్స్, నీటిపారుదల శాఖలు.. పంకజ్‌కుమార్ సింగ్‌కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రవాణా, ఐటీ శాఖలను ఇచ్చారు. కపిల్ మిశ్రాకు న్యాయ, కార్మిక, కళలు-సాంస్కృతికం, పర్యాటకం.. మంజిందర్ సింగ్ సిర్సాకు అటవీ, పర్యావరణ, ఆహార సరఫరాల శాఖ, పరిశ్రమలు.. రవీందర్ సింగ్‌కు సోషల్ వెల్ఫేర్ శాఖలను కేటాయించారు.
Also Read : ఐదుసార్లు ఎమ్మెల్యే, ప్రజా ఉద్యమకారుడు..కానీ అవమానించారు
మరోవైపు ప్రమాణ స్వీకారానికి ముందే సీఎం రేఖా గుప్తా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. మార్చి 8 లోపు అర్హులైన మహిళల ఖాతాల్లో నగదు జమ అవుతుందని రేఖా గుప్తా చెప్పారు. ఇక తాను ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్మించిన అద్దాల మేడ శీశ్ మహాల్ ను మ్యూజియంగా మారుస్తామని చెప్పారు. గత ఆప్ ప్రభుత్వాన్ని ఆమె విమర్శిస్తూ ప్రతి పైసాకు ఆప్ ప్రజలకు లెక్క చెప్పాల్సి ఉంటుందని అన్నారు. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు, గుప్తా కాశ్మీరీ గేట్ వద్ద ఉన్న శ్రీ మార్గట్ వాలే హనుమాన్ బాబా ఆలయాన్ని సందర్శించారు. కాగా ఎన్నికలకు ముందు బీజేపీ తన మ్యానిఫెస్టోలో అధికారంలోకి వస్తే రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ రూ.2,100 మద్దతు ఇస్తామని ప్రకటించింది.
Also Read: TS: తెలంగాణలో 8మంది ఐఏఎస్ లు బదిలీ
Also Read : కొడుకుకి ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారం..కానీ ఇంతలోనే తండ్రి..!