/rtv/media/media_files/2025/03/28/pW2vs2Z3QvG9K0SqFhKf.jpg)
Restaurents
Restaurant Service Charges: హోటళ్ళు, రెస్టారెంట్లలో ఫుడ్ ఇప్పుడు చాలా ఖరీదు అయిపోయింది. దీనికి కారణం ఆహార పదార్థాల ధరలు బాగా పెరిగిపోవడం ఒకటైతే..దానికి తోడు వేస్తున్న అదనపు బిల్లులు మరో కారణం. ఫుడ్ ఐటెమ్ కాస్ట్ మీద జీఎస్టీ, సర్వీస్ ఛార్జీలు అంటూ రకరకాలుగా యాడ్ చేస్తూ దాన్ని మరింత పెంచేస్తున్నారు. దీనిపై వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ పలు రెస్టారెంట్లు దాకలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. .
Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు
అది వాళ్ళిష్టం..వారికే వదిలేయాలి..
వినియోగదారులపై అదనపు ఛార్జీలను విధించే రెస్టారెంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు వినియోగదారుల ఉత్తర్వుల సంస్థకు సూచించింది. గతంలో ఈ సంస్థ ఉత్తర్వులను కోర్టు సమర్థించింది. రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి సర్వీసు ఛార్జీల రూపంలో డబ్బులు వసూలు చేయటం తప్పనిసరి కాదని చెప్పింది. ఇప్పుడు దానినే ఫాలో అవ్వాలని హైకోర్టు తేల్చి చెప్పింది. సర్వీస్ ఛార్జీలకు సంబంధించిన విషయం కస్టమర్ల విచక్షకు సంబంధించినది అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సర్వీస్ ఛార్జీ చెల్లించాలా లేదా అనేది పూర్తి వారి ఇష్టానికే వదిలేయాలని చెప్పింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) మార్గదర్శకాలను సవాలు చేస్తూ రెస్టారెంట్ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ శుక్రవారం ఈ తీర్పును ఇచ్చారు. అలాగే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ మార్గదర్శకాలను సవాలు చేసిన రెస్టారెంట్ అసోసియేషన్లపై హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించారు.
Also Read: భూకంపం ఎఫెక్ట్.. 100 దాటిన మృతుల సంఖ్య
today-latest-news-in-telugu | delhi | high-court | hotels
Also Read: Earth Quake: జస్ట్ మిస్..భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలంగాణ ఎమ్మెల్యే