/rtv/media/media_files/2025/03/25/yBCiS9sywLhGU7zTynen.jpg)
Tihar Jail
ఆసియాలో అతిపెద్ద జైలు ఏదంటే అందరికీ గుర్తుకొచ్చేది తీహార్ జైలు. అయితే ఈ జైలుకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ జైలును మరో చోటుకు మార్చేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు సీఎం రేఖా గుప్తా శనివారం ఈ విషయం వెల్లడించారు. ఢిల్లీ సరిహద్దుల్లో తీహార్ జైలును ఏర్పాటు చేసేలా ఓ సర్వే, కన్సల్టెన్సీ సర్వీసులు ఏర్పాటు కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువతిని ఢీ కొట్టి..!
Thihar Jail Shift
జైలు విస్తీర్ణం, అందులో ఉండే ఖైదీల వల్ల చుట్టుపక్కల నివసించే వారి భద్రతను దృష్టిలో ఉంటుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు. అయితే తీహార్ జైలును 1958లో నిర్మించారు. ఇందులో మొత్తం 9 జైళ్లు ఉన్నాయి. 400 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. 1966కు మందు ఇది పంజాబ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేది. ఆ ఏడాది తర్వాత దీని నిర్వహణను ఢిల్లీ ప్రభుత్వానికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఇది ప్రధాన జైలుగా ఉంది.
Also read: ఏం స్కెచ్ వేశారమ్మా.. బ్యాంకులకు టోపీ పెట్టేందుకు కట్టుకున్న మొగుళ్లను!
ఢిల్లీలో ఇప్పుడు 19 వేల మంది ఖైదీలు ఉన్నారు. అయితే తీహార్, మండోలి, రోహిణి.. ఈ మూడు జైళ్లు కూడా 10 వేల మంది ఖైదీల సామర్థ్యంతో ఉన్నాయి. ఖైదీల ఆగడాలను అడ్డుకునేందుకు ఈమధ్య అధికారులు గట్టిగా చర్యలు తీసుకుంటన్నారు. ఖైదీలు జైల్లో ఫోన్లు వినియోగించకుండా ఆపేందుకు ఆరుచోట్ల 15 జామర్లను పెడుతున్నట్లు అధికారులు చెప్పారు.
Also Read: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?
Also Read: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం!
tihar-jail | rtv-news | national-news | delhi | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu