/rtv/media/media_files/2025/02/08/zs0mMRKHhHEwN6pbExQ1.jpg)
Bjp Master Stroke On AAP
దేశ రాజధానిలో కమలం వికసింది. 27 ఏళ్ళ తర్వాత ఇక్కడ బీజేపీ గెలిచింది. గత రెండు పర్యాయాలుగా ఆప్ చేతిలో ఓడిపోతూ వస్తున్న ఈ పార్టీ...ఇప్పుడు అదే పార్టీని మట్టి కరిపించింది. ఏకంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రవాల్ ను ఓడించడమే కాకుండా ఆ పార్టీ ముఖ్య నేతలందరినీ ఇంటికి పంపించేసింది. కేజ్రీవాల్ ఓడిపోవడానికి, ఆప్ ఘోరంగా దెబ్బతినడానికి చాలా కారణాలే చెబుతున్నారు. కానీ అన్నింటికంటే ముఖ్యంగా కరెక్ట్ గా ఇంకా పోలింగ్ నాలుగు రోజుల్లో ఉందనగా బీజేపే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఇదే ఈరోజు ఆపార్టీ విజయానికి కారణమైందని చెబుతున్నారు.
బీజేపీ మాస్టర్ స్ట్రోక్..
ఈసారి ఢిల్లీ ఎన్నికల మీద బీజేపీ మొదటి నుంచి దృష్టి పెట్టింది. అరవింద్ కేజ్రీవాల్ తో పాటూ ముఖ్య నేతల అరెస్ట్ లూ, జైల్లో పెట్టడాలు..ఆప్ మ్యానిఫెస్టోకు ధీటుగా మోడీ మోడల్ మ్యానిఫెస్టో ప్రవేశపెట్టడం...ఇలా అన్నీ ఆప్ తో పోటాపోటీగా చేసుకొచ్చింది. ఆప్ ను మేజర్ గా స్కామ్ లు, జైళ్ళు తినేశాయి. వాళ్ళు దాని నుంచి ఎంత బయటపడదామని చూసినా, తమ నిజాయితీని నిరూపించుకుందామని అనుకున్నా కుదరలేదు. అయితే ఇవన్నీ చేసినా కూడా.. ఢిల్లీలో ఆప్ బలంగా ఉందనేది కాదనలేని వాస్తవం. పదేళ్ల నుంచి నిలబెట్టుకుంటూ వస్తున్న నమ్మకాన్ని ఢిల్లీ ప్రజలు మళ్ళీ ప్రూవ్ చేస్తారని అనుమానం. ఇదే సందేహంతో బీజేపీ పోలింగ్ కు నాలుగు రోజుల ముందు తన మాస్టర్ స్ట్రోక్ ను ప్రయోగించింది. దీంతో ఢిల్లీలో మేజర్ ప్రజలు బీజేపీ వైపుకు తిరిగిపోయారు.
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. కరెక్ట్ గా దానికి నాలుగు రోజుల ముందు తన చివరి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది బీజేపీ. అదే బడ్జెట్. అందులో మెయిన్ గా ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపు. ప్రస్తుతం 7 లక్షలు ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును 12 లక్షలకు పెంచుతూ...కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇది ప్రవేశపెట్టిన రోజే..ఢిల్లీ ఎన్నికల గురించి టాక్ నడిచింది. ఆరోజే అందరూ దీన్ని ఢిల్లీ ఎన్నికల్లో అస్త్రంగానే పరిగణించారు. కేవలం ఇక్కడ గెలవడానికే బీజేపీ ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిధిని పెంచిందని చెప్పారు. అదే నిజమని కూడి ఇప్పుడు ప్రూవ్ అయింది. నిజానికి, న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య లక్ష మంది. ఈ లక్ష మంది ఓటర్లలో దాదాపు 30 నుంచి 35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఇప్పుడు వీరే కేజ్రీవాల్ ఓటమికి, బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ గెలుపుకు కారణమయ్యారు. తమకు లభించిన ట్యాక్స్ బెనిఫిట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య తరగతి ఉద్యోగులు అందరూ బీజేపీకి ఓటేశారని అంటున్నారు. అందువల్లే పర్వేశ్ వర్మ గెలిచారని చెబుతున్నారు. దానికి తోడు కేజ్రీవాల్ పై పడిన మచ్చ, కాంగ్రెస్ ఓట్ల చీలికలు కూడా ఆయన ఓటమికి కారణాలుగా మిగిలాయి.