Atishi Marlena : సీఎం పదవికి అతిషి రాజీనామా

ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.  సీఎం పదవికి అతిషి రాజీనామా చేశారు.  తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందించారు అతిషి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని అతిషిని కోరారు ఎల్జీ.

New Update
cmatishi

cmatishi

ఢిల్లీ (Delhi) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.  సీఎం పదవికి అతిషి (Atishi) రాజీనామా చేశారు.  తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందించారు అతిషి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని అతిషిని కోరారు ఎల్జీ.  కేజ్రీవాల్ అరెస్టు తర్వాత అనూహ్యంగా సీఎం అయ్యారు అతిషి. నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కల్కాజీ స్థానం నుంచి అతిషి ఎమ్మెల్యేగా గెలుపోందారు. ఇక్కడినుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలవడం ఇది రెండోసారి. 

Also Read :  థైరాయిడ్ టాబ్లెట్స్‌ వేసుకున్నాక ఎన్ని గంటలు ఏమీ తినకూడదు?

Also Read :  భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ముఖ్యమంత్రి పదవికి  గత ఏడాది సెప్టెంబర్ 17న రాజీనామా చేసిన  తర్వాత సెప్టెంబర్ 21న అతిషి ఢిల్లీ ఎనిమిదవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆమె పదవీకాలం నాలుగున్నర నెలలు మాత్రమే కొనసాగింది. ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిషి నిలిచారు.  ఆమె కంటే ముందు దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ , దివంగత కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

Also Read :  పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి :  పాక్ ప్రధాని

48 స్థానాలతో అధికారంలోకి 

కాగా శనివారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 స్థానాలను గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం 22 సీట్లు మాత్రమే గెలుచుకోగా, కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఖాతా తెరవలేకపోయింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లతో సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అనేక మంది అగ్ర నాయకులు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. సీఎం అతిషితో పాటుగా ముగ్గురు మంత్రులు గోపాల్ రాయ్, ముఖేష్ అహ్లావత్ , ఇమ్రాన్ హుస్సేన్ విజయాలను అందుకున్నారు.  

ఇక ఢిల్లీ అసెంబ్లీలో మహిళల సంఖ్య తగ్గింది. గత ఎన్నికల్లో 8మంది ఎమ్మెల్యేలుగా గెలవగా ఈసారి ఐదుగురు మాత్రమే విజయం సాధించారు. వీరిలో బీజేపీ నుంచి నలుగురు ఉండగా, ఆప్ నుంచి ఆతిశీ మాత్రమే ఉన్నారు. ఇక మొత్తంగా గెలిచిన అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా బీజేపీ క్యాండిడేట్ కర్నాలీ సింగ్(రూ.259 కోట్లు) నిలిచారు. అత్యధిక కేసులున్న(19) ఎమ్మెల్యేగా ఆప్ నేత అమానుతుల్లా ఖాన్ ఉన్నారు.

Also Read :  Chhattisgarh Encounter : భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు