Delhi Assembly Elections: ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్‌దే !.. సంచలన సర్వే

ఢిల్లీలో దళిత ఓట్లు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకే రానున్నాయని ఓ సర్వే వెల్లడించింది. 44 శాతం మంది దళితులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తామని చెప్పారు. 32 శాతం మంది బీజేపీకి, 21 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేస్తామని తెలిపారు.పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Arvind Kejriwal

Arvind Kejriwal

Delhi Assembly Elections: మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు పోటీపోటీగా ఎన్నికల ప్రచారాలు చేస్తున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈసారి ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే 'నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్​ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్' (NACDAOR) అలాగే 'ది కన్వర్జెంట్ మీడియా' సంయుక్తంగా జరిపిన సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. 

Also Read: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు.. బీజేపీ సంచలన వ్యూహం

దళిత ఓట్లు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకే..

ఢిల్లీలో దళిత ఓట్లు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకే రానున్నాయని ఈ సర్వే వెల్లడించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఈ రెండు సంస్థలు ఢిల్లీలో 6,256 మంది దళితులపై ఎన్నికల సర్వే నిర్వహించాయి. ఇందులో 2,574 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ సర్వేలో 44 శాతం మంది దళితులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తామని చెప్పారు. 32 శాతం మంది బీజేపీకి, 21 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేస్తామని తెలిపారు. ఆప్‌కు 35 స్థానాల్లో దళితుల మెజార్టీ ఓట్లు ఆప్‌కు పడనున్నాయి. ఇక బీజేపీకి 28 స్థానాల్లో, కాంగ్రెస్‌కు 7 స్థానాల్లో దళితుల మెజార్టీ ఓట్లు పడనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఎస్​సీ రిజర్వుడ్ సీట్లు ఉండటం మరో విశేషం. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా కేజ్రీవాల్‌కే పడనున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి ఆప్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.  

Also Read: వాళ్లకి రుణమాఫీ చేయొద్దు.. కేజ్రీవాల్ సంచలన డిమాండ్

ఇక్కడ మరోవిషయం ఏంటంటే ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 2020లో 53 శాతం మంది ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటు వేశారు. 33 శాతం బీజేపీకి, 11 శాతం కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో 52 శాతం మంది దళితులు ఆప్‌-కాంగ్రెస్‌కు, 46 శాతం మంది బీజేపీకి ఓటేశారు. ఢిల్లీ ఓటర్లలో 16.7 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. వీళ్ల ఓట్లు కీలకంగా మారనుండటంతో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టిసారించాయి. అయితే ఈ సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది.. శీలా దిక్షిత్ పాలన కంటే కేజ్రీవాల్‌ పాలన బాగుందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీలో అధికారం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. 

Also Read:  Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!

ఇదిలాఉండగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈసారి ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై దేశవ్యాప్తంగా సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరి ఈసారి ఢిల్లీ ప్రజలు ఎవరికి అధికారమిస్తారో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకు వేచిచూడాల్సిందే.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు