Delhi Assembly Elections: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party), బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు ఒకదానిపై మరొకటి తీవ్రంగా విమర్శలు చేసుకున్నాయి. ఫిబ్రవరి 5న (బుధవారం) పోలింగ్(Poling) జరగనుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈసారి ఎన్నికల ప్రచారంలో కాలుష్యం, తాగు నీటి సమస్య, యమునా నదీ అంశాలపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ముఖ్యంగా యమునా నది వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపింది.
Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం
ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే గట్టి పోటీ నెలకొంది. ఆప్, కాంగ్రెస్ పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేరు వేరుగా పోటీ చేస్తున్నాయి. అంతేకాదు ఆప్, కాంగ్రెస్ పార్టీల నేతలు కూడా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. అయితే ఈసారి కూడా ఆప్ గెలవొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలను కలిపి విమర్శించిన రాహుల్ గాంధీ
సర్వేలు ఏం, చెబుతున్నాయంటే..
మరోవైపు పలు స్థానిక సంస్థలు కూడా తమ సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చి చెప్పాయి. కానీ 2015, 2020 ఎన్నికల కంటే ఈసారి ఆప్‌నకు సీట్లు తగ్గనున్నట్లు తమ సర్వేలో వెల్లడించాయి. ఆప్‌కు 38- 40 సీట్లు, బీజేపీకి 31-33, కాంగ్రెస్ 0 సీట్లు వస్తాయని ఫలోడి సత్తా బజార్ అనే సర్వే అంచనా వేసింది. ఇక వీప్రిసైడ్ అనే సర్వే కూడా ఆప్‌కు 50-55, బీజేపీకి 15-20, కాంగ్రెస్‌కు 0 సీట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వేలు చెప్పడం గమనార్హం. అయితే మరీ ఈసారి ఢిల్లీ ప్రజలు ఏ పార్టీకి అధికార పగ్గాలు అప్పగిస్తారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.