Delhi: మొదటి రెండు గంటల్లో 8శాతం పోలింగ్..ఓటేసిన ప్రముఖులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొదటి రెండు గంటల్లో దాదాపు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటూ మరికొంత మంది ప్రముఖులు ఓటేశారు. 

author-image
By Manogna alamuru
New Update
delhi

Delhi Polling

 ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లో అందరూ చురుగ్గా పాల్గొంటున్నారు. అక్కడ ఉన్న ప్రముఖులు, రాజకీయ నేతలు వచ్చే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటింగ్ మొదలై ఇప్పటికి మూడు గంటలు గడించింది. మొదటి రెండు గంటల్లో దాదాపుగా 8.10 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు లెక్కలు చెప్పారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటూగా తమిళనాడులోని ఈరోడ్, ఉత్తరప్రదేశ్ లోని మిల్కిపుర్ లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 10.95 శాతం, 13.35 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోడ్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ మృతి చెందడంతో అక్కడ ఉపఎన్నికల నిర్వహిస్తున్నారు. 

ఓటేసిన ప్రముఖులు..

--రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..రాష్ట్రపతి ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. 
--కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నిర్మాణ్‌ భవన్‌లో తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
--కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ తరపున పోటీ చేస్తున్న ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి అక్కడే ఓటు వేశారు. 
--భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌, ఆయన సతీమణి తుగ్లక్‌ క్రెసెంట్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు.
--కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి, ఆయన భార్య లక్ష్మీ పురి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆనంద్‌ నికేతన్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
--ఇండియన్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్ కె. త్రిపాఠీ కె.కమ్రాజ్‌ లేన్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
--ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తన సతీమణి సీమాతో కలిసి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు. 
--ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా రాజ్‌ నివాస్‌ మార్గ్‌లో ఓటు హర్కును వినియోగించుకున్నారు.

Also Read: USA: ఇరాన్ అణ్వాయుధాలకు ట్రంప్ అడ్డుకట్ట...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు