‘బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్‌లా’ 2025 బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు

2025 బడ్జెట్ పై రాహుల్ గాంధీ విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు బుల్లెట్‌ గాయాలకు బ్యాండ్‌ ఎయిడ్‌ వేసినట్టుగా ఉందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎక్స్ వేదికగా ఆయన బడ్జెట్‌ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.

author-image
By K Mohan
New Update
budget 2025 522

budget 2025 522 Photograph: (budget 2025 522)

పార్లమెంట్‌లో శనివారం ప్రవేశపెట్టిన 2025 ఫైనాన్షియల్ ఈయర్ బడ్జెట్‌పై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎక్స్ వేదికగా ఆయన బడ్జెట్‌ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. బుల్లెట్‌ గాయాలకు బ్యాండ్‌ ఎయిడ్‌ వేసినట్టుగా ఉందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో లోపాల గురించి మాట్లాడకుండా బడ్జెట్ మొత్తాన్ని విమర్శిస్తూ ఈ విధంగా తన ఎక్స్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: UNION BUDGET 2025: ఇంత అన్యాయమా?: కేంద్ర బడ్జెట్ పై రేవంత్ ఫైర్!

ప్రపంచ అస్థిరత కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితుల దృష్యా దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. కానీ బడ్జెట్ కేటాయింపు, పన్ను విధానాల్లో ప్రభుత్వం దివాళా కోరు ఆలోచనలు చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. పైపై మెరుగులు అద్దే విధంగానే బడ్జెట్ 2025 ఉందని.. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేటాయింపులు భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టలేవని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇది నామమాత్రపు బడ్జెట్‌యే అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు