/rtv/media/media_files/2026/05/05/tvk-vijay-unanimously-elected-as-legislative-party-leader-2026-05-05-15-46-59.jpg)
Congress officially extends 'conditional' support to TVK
TN Politics: తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, నటుడు విజయ్(tvk vijay) నేతృత్వంలోని TVK (తమిళగ వెట్రి కళగం) సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ (118)కు స్వల్ప దూరంలో ఆగిపోయిన విజయ్‌కు, కాంగ్రెస్ పార్టీ(congress) అనూహ్య మద్దతు ప్రకటించడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. AIDMK
Also Read : త్రిషకు విజయ్ బిగ్‌షాక్.. తిరుచ్చి ఈస్ట్ నుంచి నో టికెట్!
కాంగ్రెస్ - TVK పొత్తు: షరతులు వర్తిస్తాయి
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమిళనాడు(tamilanadu)laty కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమై, విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్, కేవలం ప్రభుత్వం ఏర్పాటుకే కాకుండా భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థలు, లోక్‌సభ ఎన్నికల్లోనూ TVKతో కలిసి నడవాలని నిశ్చయించుకుంది. అయితే, "మతతత్వ శక్తులను (BJP వంటి పార్టీలను) కూటమికి దూరంగా ఉంచాలి" అనే ప్రధాన షరతును కాంగ్రెస్ విధించింది. దీనికి బదులుగా రెండు క్యాబినెట్ పదవులతో పాటు ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యాన్ని కాంగ్రెస్ ఆశిస్తోంది. రాష్ట్రంలో లౌకిక, అభ్యుదయ ప్రభుత్వాన్ని అందించడమే తమ లక్ష్యమని ఏఐసీసీ ఇంచార్జి గిరీష్ చోడంకర్ స్పష్టం చేశారు.
'వెన్నుపోటు' రాజకీయాలపై విమర్శలు
కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం సుదీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్న DMKకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ తీరుపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ నాయకులను "వెన్నుపోటుదారులు"గా అభివర్ణిస్తూ డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ తమతో కలిసి ఉండి, అధికార మార్పిడి సమయంలో ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం రాజకీయ ద్రోహమని డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామంతో తమిళనాడులో ఇండియా (I.N.D.I.A) కూటమి సమీకరణాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది.
మద్దతు వేటలో విజయ్
108 స్థానాలు సాధించిన విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ (5) మద్దతుతో ఆ సంఖ్య 113కు చేరింది. మెజారిటీకి ఇంకా ఐదుగురు సభ్యులు తక్కువగా ఉండటంతో, విజయ్ బృందం VCK (విలై చిరుతైగల్ కట్చి), సీపీఐ(ఎం), సీపీఐ , ఐయూఎంఎల్ వంటి పార్టీలతో ముమ్మర చర్చలు జరుపుతోంది. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా తాము కూడా విజయ్‌తో కలిసే అవకాశం ఉందని ఈ పార్టీల నుంచి సంకేతాలు అందుతున్నాయి. సాయంత్రం లోపు ఈ పార్టీల మద్దతు లేఖలను సేకరించి, విజయ్ గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది.
Also Read : పళనిస్వామికి బిగ్ షాక్ .. అన్నాడీఎంకే లో చీలిక.... 40 మంది ఎమ్మెల్యేల జంప్?
రేపే 'ముఖ్యమంత్రి'గా విజయ్ ప్రమాణ స్వీకారం
అన్ని అనుకూలిస్తే, రేపు (మే 7న) ఉదయం 11:30 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ వేడుక కోసం పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం, చెన్నై నగరం భారీ ఎత్తున సిద్ధమవుతోంది. ఒక సామాన్య నటుడి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రస్థానం, తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలకబోతోంది. సాయంత్రం గవర్నర్‌తో భేటీ అనంతరం ఈ ప్రక్రియపై మరింత అధికారిక స్పష్టత రానుంది.
Follow Us