యుమునా నది నీళ్ళపై పెద్ద దుమారమే లేచింది. హర్యానా నుంచి వస్తున్న నది నీళ్ళల్లో బీజేపీ విష ప్రయోగం చేసిందని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిని హర్యానా ముఖ్యమంత్రి సైనీ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు యమునా నదిలో దిగి నీళ్ళు తాగి మరీ చూపించారు. ఈ విషయం ఈసీ వరకూ కూడా వెళ్ళింది. ఇరు వర్గాలకు ఈసీ దీనిపై నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఈ విషయంలోకి కాంగ్రెస్ కూడా దూరింది.
ఇది కూడా చదవండి: live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి
నదిలో ప్రయాణించిన రాహుల్..
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం యమునా నదిలో తిరిగారు. బోటులో తిరుగుతూ నదిలోని నీళ్ళను పరిశీలించారు. అక్కడే ఉన్న స్థానికులతో సంభాషించారు. అదంతా అయ్యాక ఆప్ , బీజేపీలపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. ఇరు పార్టీల అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే యమునా నదిలో నీరు కలుషితం అయిందని ఆరోపించారు. ఐదేళ్ల క్రితం కేజ్రీవాల్ నదిలో స్నానం చేస్తానని అన్నారు. ఎప్పుడైనా చేశారా అంటూ రాహుల్ ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఆయన వీడియోను కూడా విడుదల చేశారు.
ఇక ఢిల్లీ ఎన్నికల ప్రచారం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి.
Also Read: TS: తెలంగాణ యూనివర్శిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు