/rtv/media/media_files/2026/05/04/kcr-jagan-and-vijay-2026-05-04-16-07-25.jpg)
KCR, Jagan and Vijay
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ దూసుకుపోతోంది. సుమారు 107 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా విజయ్ సింగిల్‌గా బరిలోకి దిగారు. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఇంతటీ భారీ స్థాయిలో సీట్లు గెలుచుకోనుండటం, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ లాగే ఏపీలో వైస్ జగన్ కూడా సింగిల్ పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
దీంతో వైసీపీ శ్రేణులు విజయ్ గెలుపును వైఎస్ జగన్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ''YS జగన్, విజయ్ మాదిరిగా సింహాలు ఎప్పుడైనా సింగిల్ వస్తాయని.. పొత్తుల కోసం పాకులాడవని అంటున్నారు. ఓడినా, గెలిచినా రాజసం లాంటి రాజకీయం చేస్తాయని చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఎవరితో పొత్తు లేకుండా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. అయితే ఈ ముగ్గురు నేతల్లో కొన్ని కామన్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
YS జగన్ & విజయ్ మాదిరిగా సింహాలు ఎప్పుడైనా సింగల్ గానే వస్తాయి. పొత్తుల కోసం పాకులాడవు.ప్రాణం పోయినా సరే ఇంకో పార్టీ జెండా మొయ్యవు .ఓడినా గెలిచినా రాజసం లాంటి రాజకీయం చేస్తాయి ...అది సింహాల నైజం
— Maya Bazar (@ChicagoSub40687) May 4, 2026
YS Jaganmohan Reddy (Former CM of AP)
Dalapathy Vijay (Present CM of TN) pic.twitter.com/HYE3T6JxTf
తిరుగులేని జనాకర్షణ
విజయ్: ఎన్నో ఏళ్లుగా సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ 'స్టార్ ఇమేజ్' ఆయనకు పెద్ద బలం.
జగన్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా, అలాగే స్వయంకృషితో 'జగనన్న'గా రాష్ట్రంలో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారు.
కేసీఆర్: తెలంగాణ ఉద్యమకారుడిగా, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా జనాధారణ సొంతం చేసుకున్నారు.
పాదయాత్రలు, క్షేత్రస్థాయి సంబంధాలు
జగన్: 3,600 కిలోమీటర్ల 'ప్రజా సంకల్ప యాత్ర' జగన్‌కు సీఎం పదవి కట్టబెట్టింది.
కేసీఆర్: ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రతి పల్లెను చుట్టి ప్రజల నాడిని పట్టుకున్నారు.
విజయ్: విజయ్ కూడా తన 'మక్కల్ ఇయక్కం' (ప్రజల కోసం పనిచేసే సంస్థ)తో క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ను నిర్మించుకున్నారు.
సంక్షేమ పథకాలపై ఫోకస్
జగన్: 'నవరత్నాలు' పథకాలు వైసీపీని 2019లో భారీ స్థానాల్లో గెలిపించాయి.
కేసీఆర్: రైతు బంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి లాంటి పథకాలు బీఆర్ఎస్ పార్టీకి బలంగా మారాయి.
విజయ్: విజయ్ సైతం టీవీకే (TVK) మేనిఫెస్టోలో ఉచిత విద్య, వైద్యం, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామని ప్రకటన చేశారు.
ప్రాంతీయ వాదం, ఆత్మగౌరవం
కేసీఆర్: 'తెలంగాణ ఆత్మగౌరవం' నినాదంతో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు.
జగన్: వైఎస్సాఆర్ వారసుడైనప్పటికీ.. ఒంటరిగా పోరాడ తన సొంత బలాన్ని నిరూపించుకున్నారు.
విజయ్: తమిళనాడు రాజకీయాల్లో 'ద్రవిడ గుర్తింపు' 'తమిళ జాతీయత'ను మేళవించి విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
Follow Us