/rtv/media/media_files/2026/05/12/cm-vijay-2026-05-12-16-12-10.jpg)
CM Vijay
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రార్థనా మందిరాలు, పాఠశాలల వద్ద మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమిళనాడువ్యాప్తంగా 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాలు, చర్చిలు, మసీదీలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టం చేసింది.
Also Read: తొమ్మిదేళ్లలో 70కి పైగా పేపర్ లీక్‌లు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు
తమిళనాడు రాష్ట మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) ఆధ్వర్యంలో ఆ ప్రాంతాలకు సమీపంలో నడుస్తున్న మద్యం షాపులన్నీ రెండు వారాల్లోగా మూసివేయాలని ఆదేశించింది. సామాన్య ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. అయితే తమిళనాడు ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా TASMAC ఆధ్వర్యంలో మొత్తం 4,765 మద్యం రిటైల్ దుకాణాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మూసివేసేందుకు గుర్తించిన 717 దుకాణాల్లో.. 276 ప్రార్థనా మందిరాల సమీపంలోనే ఉన్నాయి. మరో 186 విద్యాసంస్థలు, మరో 255 బస్‌స్టాండ్‌లకు దగ్గర్లో ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో మరికొన్ని రోజుల్లో ఇవన్నీ మూతపడనున్నాయి.
Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. NEET (UG)-2026 పరీక్ష రద్దు
మద్యం షాపులపై సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రార్థనా మందిర స్థలాలు, విద్యాసంస్థల దగ్గర్లో మద్యం షాపులను తొలగించాలని రాష్ట్ర ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్నారని తెలిపారు. అంతేకాదు మద్యం అమ్మకాలు ప్రభుత్వ విధిగా ఉండొద్దని.. వాటిని నియంత్రించే బాధ్యతను మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఈ నిర్ణయం 717 దుకాణాలతో ఆగిపోకూడదని.. ఈ చర్యను నిరంతరాయం కొనసాగుతూ ఉండాలని కోరారు.
Follow Us