CM Stalin: హిందీ వల్ల 25 నార్త్ ఇండియా భాషలు నాశనమయ్యాయి: స్టాలిన్

సీఎం స్టాలిన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష వల్ల ఉత్తర భారత్‌లో 25 భాషలు కనుమరుగైపోయాయని ఎక్స్‌ వేదికగా విమర్శలు చేశారు. తమిళనాడుకు ఇలాంటి పరిస్థితి రావద్దనే ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

New Update
CM Stalin

CM Stalin

హిందీ భాషపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడులోని అధికార డీఎంకే మధ్య గత కొన్నిరోజులుగా వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం స్టాలిన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష వల్ల ఉత్తర భారత్‌లో 25 భాషలు కనుమరుగైపోతున్నాయని ఎక్స్‌ వేదికగా విమర్శలు చేశారు. 

Also Read: ఖజ్జూర పండ్లలో బంగారం, విగ్‌లో కొకైన్.. పుష్పా మించిన ట్విస్టులు (VIDEO)

'' ఇతర రాష్ట్రాలకు చెందిన సోదర, సోదరీమణులారా.. హిందీ భాష వల్ల ఎన్ని భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయో  ఎప్పుడైనా ఆలోచించారా?. గత 100 సంవత్సరాల్లో నార్త్‌ ఇండియాలో మొత్తం 25 భాషలు కనుమరుగయ్యాయి. బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, భోజ్‌పురి, మైథిలీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ ఇలా చాలా భాషలు మనుగడ కోసం ఎదురుచూస్తున్నాయి. హిందీ మాతృ భాషలను చంపేస్తుంది. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లు హిందీ రాష్ట్రాలు కావు. కానీ వాటి అసలు భాషలు గతానికి సంబంధించిన అవశేషాలు. తమిళనాడుకు ఇలాంటి పరిస్థితి రావద్దనే వ్యతిరేకిస్తున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేసేందుకు భాషలపై దాడులు చేస్తున్నారంటూ'' స్టాలిన్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. 

Also Read: ఢిల్లీలోని ఎయిమ్స్‌‌లో అరుదైన ఆపరేషన్.. పొట్టలోని 2 కాళ్లు తొలగింపు

ఇదిలాఉండగా జాతీయ విద్యా విధానం (NEP)లో ఉన్న త్రిభాషా సూత్రం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాష నేర్చుకోవాలని కేంద్రం ఆదేశించింది. కానీ తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని.. హిందీని బలవంతంగా తమపై రుద్దితే సహించేది లేదని డీఎంకే ప్రభుత్వం తేల్చిచెబుతోంది. మరోవైపు భాషా వివాదంపై తమిళగ వెట్కి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్‌ స్పందించారు. ఈ వివాదం బీజేపీ, డీఎంకేల మధ్య చిన్న పిల్లల కోట్లాటాల ఉందంటూ సెటైర్లు వేశారు. 

Also Read: కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా వ్యాఖ్యలను తిప్పి కొట్టిన కేంద్ర విద్యాశాఖ!

Advertisment
Advertisment
Advertisment