Tamilnadu: స్టాలిన్ సంచలన నిర్ణయం.. మహిళల ఖాతాల్లోకి రూ.5 వేలు

తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు డీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించింది.

New Update
CM Stalin

CM Stalin

తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు డీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించింది. కలైంగర్‌ అనే స్కీమ్ కింద రాష్ట్రంలోని 1.3 కోట్ల మంది మహిళల్లో ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున డబ్బులు జమ చేసినట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ప్రతినెలా మహిళలకు అందించే రూ.1000 ఆర్థిక సాయాన్ని ముందుగానే అందించినట్లు చెప్పారు. 

Also Read: బంగ్లాదేశ్‌‌తో భారత్‌కు మళ్లీ మంచిరోజులు.. కొత్త ప్రధాని దోస్త్ మేరా తారిఖ్ రెహమాన్!

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో స్త్రీలకు ఇవ్వాల్సిన రూ.3 వేలకు మరో రూ.2 వేలు అదనంగా కలిపి రూ.5 వేలు వారి అకౌంట్లలో జమ చేసినట్లు పేర్కొన్నారు. మహిళలకు ఆర్థిక మద్దతు, సంక్షేమం, సాధికారత, స్వయం ఉపాధి అందించడం ఈ స్కీమ్ ఉద్దేశమని పేర్కొన్నారు. కొందరు ఎన్నికల పేరుతో ఈ స్కీమ్‌ను అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఎవరు అడ్డుకున్నా మేము వెనక్కి తగ్గేది లేదన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సాగాలంటే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి సపోర్ట్‌ ఇవ్వాలని కోరారు. 

Also Read: బంగ్లాదేశ్‌ ఎన్నికల ఫలితాలు విడుదల.. తారిఖ్ రెహమాన్‌కు డబుల్ విక్టరీ!

Advertisment
తాజా కథనాలు