/rtv/media/media_files/2025/02/03/psFcKw6xv7x5m32dZwAA.jpg)
maoist in karnataka Photograph: (maoist in karnataka)
Maoist: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల కాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులు కొనసాగుతుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. సంఘటన స్థలం నుండి మావోయిస్తు మృత దేహాల, భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్ల పోలీసులు తెలిపారు.
గత వారమే 30 మంది హతం..
గత వారమే మావోయిస్టులకు ఊహించని షాక్ తలిగింది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఒకేరోజు రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఉదయంగా బీజాపుర్‌లో 26 మంది మావోలు చనిపోగా.. కాంకెర్ జిల్లాలో మరో నలుగురు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 30కి చేరింది. సంయుక్త బలగాలు గురువారం ఉదయం నుంచి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగగా.. మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. పోలీసుల కాల్పుల్లో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు.
Also Read: SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!
ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. డీఆర్‌జీ, బీఎస్‌ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
chattisgarh | encounter | telugu-news | today telugu news