/rtv/media/media_files/2025/03/25/oCWGhckAfbnWDTeDZ7jP.jpg)
pm kisan samman nidhi Scheme
మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో చాలామంది అనర్హులు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అనర్హుల ఏరివేతకు కేంద్రం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ స్కీమ్‌లో అనర్హుల నుంచి ఇప్పటిదాకా రూ.416 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. లోక్‌సభలో దీనికి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Also Read: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువతిని ఢీ కొట్టి..!
అయితే పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా అర్హులైన రైతులకు కేంద్రం ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. మూడు విడుతల్లో వీటిని అందిస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం ప్రారంభమయ్యింది. ఇప్పటిదాకా 19 విడుతల్లో రూ.3.68 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రం చెప్పింది. ఈ స్కీమ్‌ను ప్రారంభించినప్పుడు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా లబ్దిదారుల పేర్లు నమోదు చేశారు. ఇప్పటికే 100 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయ్యింది. ఆధార్, ఆదాయ పన్నుశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారంతో అనర్హులను ఏరివేసే కార్యక్రమం చేపట్టారు.
Also read: ఏం స్కెచ్ వేశారమ్మా.. బ్యాంకులకు టోపీ పెట్టేందుకు కట్టుకున్న మొగుళ్లను!
ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, చట్టబద్ధ పదవుల్లో ఉన్నవారు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందితే వాళ్ల నుంచి రికవరీ చేయాలి కేంద్రం రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. మరోవైపు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. పీఎం కిసాన్ ఆన్‌లైన్ పోర్టల్‌లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చని చెప్పారు.
Also Read: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?
rtv-news | pm-kisan-nidhi-yojana | pm modi | national-news