/rtv/media/media_files/2025/03/27/ZFcVVp76AGHAkKoQ1bCf.jpg)
collaborative taxi platform Photograph: (collaborative taxi platform)
ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్లకు కేంద్ర శుభవార్త చెప్పింది. రైడ్ హెయిలింగ్ కంపెనీలు డైవర్ల కష్టాన్ని దోచుకుంటున్న విషయం తెలిసిందే. ప్యాసింజర్ల దగ్గర నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసి.. డ్రైవర్లకు మాత్రం తక్కువ మొత్తంలో చెల్లిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ సర్వీసుల్లో ఓలా, ర్యాపిడో, ఉబర్ కంపెనీలు అధిక మొత్తంలో కమీషన్ తీసుకుంటున్నాయి. దీంతో రైడ్ నిర్వహించిన వారికి కార్మికులకు కొద్దోగొప్పో మాత్రమే మిగులుతున్నాయి. ఈ రంగంలో ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో క్యాబ్ సర్వీస్ ప్రారంభిచనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిషా పార్లమెంట్‌లో ప్రకటించారు.
Also read: Google: గుట్టుచప్పుడు కాకుండా గూగుల్ మీ ప్రతీ మాట వింటోంది.. ఇలా చెక్ పెట్టిండి!
Sounds Interesting! Hopefully, this may give relief from annoying cancellations by the drivers.
— Nilesh Mishra (@i_mnilesh) March 26, 2025
Govt to launch a Cooperative taxi services like Ola and Uber, but the benefits will go directly to drivers.
pic.twitter.com/zpBTUmX9cD
Also read: Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతాడు
మోదీ సర్కార్ రానున్న కొద్ది నెలల్లో క్యాబ్ సేవలను ఓలా, ఉబెర్ తరహాలోనే స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని వెల్లడించారు. ఇందుకోసం సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తమ టూవీలర్స్, త్రీవీలర్స్, ఆటోలు, కార్లను ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ నుంచి వచ్చే లాభాలు నేరుగా రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్లకు వెళతాయని అమిత్ షా అన్నారు. ఈ ప్రకటన ప్రైవేటు సర్వీస్ ప్రొవైడర్లైన ఓలా, ఉబెర్, ర్యాపిడోలకు నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పటికే ఓఎన్డీసీ వంటి ఓపెన్ ఫ్లాట్ ఫారమ్ ఆధారంగా బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన మెట్రో నగరాల్లో వివిధ యాప్స్ సదరు దిగ్గజ కంపెనీల పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ రంగంలోకి దిగితే పోటీ మరింత పెరుగుతుందని తెలుస్తోంది. కానీ ప్రజలకు దీని వల్ల మెరుగైన సేవలు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.