/rtv/media/media_files/2025/02/20/5tvqMa3hvg8zlsRiah5l.jpg)
OTT Photograph: (OTT)
ఓటీటీ సంస్థ(OTT Platforms)కు కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రూల్స్ 2021(IT Rules 2021) ప్రకారం సోషల్ మీడియాలు, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు అన్ని కూడా తప్పకుండా రూల్స్ అన్ని పాటించాలని తెలిపింది. అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్(Obscene Content)ను అసలు ప్రసారం చేయకూడదని తెలిపింది. వయస్సు ఆధారిత కంటెంట్(Age-based Content) మాత్రమే అందుబాటులో ఉండాలని, ఓటీటీ సంస్థలు అన్ని కూడా తప్పకుండా నైతిక విలువలను పాటించాలని వెల్లడించింది.
ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!
Breaking News 🚨
— The Delhi Dialogues (@DelhiDialogues6) February 20, 2025
The Indian Ministry of Information and Broadcasting has issued an advisory to Over-The-Top (OTT) platforms, emphasizing strict adherence to the IT Rules 2021 and the Code of Ethics following controversial content aired on the show 'India's Got Latent.' pic.twitter.com/tSttc6lGmJ
ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..
రణవీర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో..
నిబంధనలకు విరుద్ధంగా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఇండియాస్ గాట్ లాటెంట్(IGL) కార్యక్రమంలో రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇవి తీవ్ర దుమారం రేపడంతో కేంద్రం ఓటీటీ సంస్థలపై సీరియస్ అయ్యింది. పిల్లలకు ఎ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని కేంద్రం ఆదేశించింది.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
ఇండియాస్ గాట్ లాటెంట్ పాల్గొన్న ఓ వ్యక్తిని ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా తల్లిదండ్రులు, శృంగారంపై ప్రశ్నించారు. దీంతో అతనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు రాష్ట్రాల్లో అతనిపై ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి. దీంతో ఆ యూట్యూబర్ ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటిని కూడా క్లబ్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఆల్హాబాదియా వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చూడండి: రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు!