/rtv/media/media_files/2026/02/14/central-cabinet-takes-key-decisions-2026-02-14-17-14-36.jpg)
Central Cabinet takes key decisions
శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. దేశాభివృద్ధికి సంబంధించి కేంద్రం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, రవాణా, స్టార్టప్‌ల బలోపేతం కోసం ఏకంగా రూ. 1,60,504 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ సర్కార్ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
అర్బన్ ఛాలెంజ్ ఫండ్
పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం రూ.1 లక్ష కోట్లతో 'అర్బన్ ఛాలెంజ్ ఫండ్'ను ప్రారంభించింది. దీని నుంచి రాబోయే ఐదేళ్లలో నగరాల్లో మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టైర్ 2, టైర్ 3 లాంటి చిన్న నగరాలు అప్పులు తీసుకునేందుకు వీలుగా రూ.5 వేల కోట్లతో క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌కు ఆమోదం తెలిపారు.
Also Read: 'త్రిషను వదిలేయ్ ముందు'.. విజయ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
రైల్వే ప్రాజెక్టుల విస్తరణ
రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే దిశగా పలు కీలక మార్గాల్లో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
కసారా - మన్మాడ్: రూ.10,154 కోట్లతో 131 కి.మీ మేర రైల్వే లైన్ల నిర్మాణం.
ఢిల్లీ - అంబాలా: రూ. 5,983 కోట్లతో 194 కి.మీ మేర 3, 4 లైన్లు.
బళ్లారి - హోస్పేట: రూ. 2,372 కోట్లతో రైల్వే లైన్ల విస్తరణ.
తెలంగాణకు గుడ్‌న్యూస్
తెలంగాణలోని గుడబెల్లూరు నుంచి - మహబూబ్‌నగర్ మధ్య 4 లైన్ల జాతీయ రహదారికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.3,715 కోట్లు నిధులను విడుదల చేసింది. ఇది హైదరాబాద్ - పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఉండనుంది. ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ నుంచి రాయచూర్, మంత్రాలయం, గోవా వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం చాలావరకు తగ్గనుంది. రూ.3,175 కోట్ల వ్యయంతో 80.01 కిలోమీటర్లు మేర నిర్మించే ఈ ప్రాజెక్టును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) చేపట్టనుంది. ఈ రోడ్డు మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర, మరికల్, మఖ్తల్, మాగనూరు మీదుగా గుడబెల్లూరు వరకు వెళ్తుంది.
స్టార్టప్ ఇండియా ఫండ్ 2.0
స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో 'స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0'కు ఆమోదం తెలిపారు. ఇది ముఖ్యంగా డీప్-టెక్, అత్యాధునిక తయారీ రంగాల్లోని స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించనుంది.
PMO పేరు మార్పు
ఢిల్లీలోని సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్‌లను మ్యూజియంలుగా మారుస్తూ కేంద్రం నిర్ణయించింది. అలాగే ప్రధానమంత్రి కార్యాలయం (PMO) భవన సముదాయానికి 'సేవా తీర్థ్'గా పేరు మారుస్తూ ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Also Read: సెప్టిక్ ట్యాంక్‌లో శవంగా తేలిన మహిళ.. కేసులో షాకింగ్ విషయాలు!
అస్సాంలో అండర్ వాటర్ టన్నెల్
అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద గోహుపూర్ - నుమాలిఘర్ మధ్య భారీ 'అండర్ వాటర్ రోడ్ టన్నెల్' నిర్మాణానికి కూడా కేంద్ర ఆమోదం లభించింది. 34 కిలోమీటర్ల మేర ఉండే ఈ టన్నెల్ వల్ల దాదాపు 250 కి.మీ దూరం తగ్గుతుంది. 6 గంటల ప్రయాణ సమయం కేవలం 20 నిమిషాలకు తగ్గనుంది.
Follow Us