/rtv/media/media_files/2025/03/11/QtYXPuCBa6SCKeUBLjkZ.jpg)
Ranya Rao
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. సీబీఐ దర్యాప్తు వేళ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.అవినీతి నిరోధక చట్టం కింద నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్ లో నిందితుల పేర్లు రాసేందుకు కేటాయించిన కాలమ్ ను దర్యాప్తు సంస్థ బ్లాంక్ గా ఉంచినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Also Read: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
రన్యారావు కేసులో రాజకీయ నేతలు,అధికారుల పాత్ర ఉండొచ్చని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసునుంచి బయటపడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులను ఆమె సంప్రదించినట్లు కథనాలు వెలువడ్డాయి. అలాగే ఆమె బంగారం తరలించే సమయంలో విమానాశ్రయంలో వీఐపీ ప్రొటోకాల్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Balineni: జగన్ నా ఆస్తులు గుంజుకున్నాడు.. ఆ పాపం ఊరికేపోదు.. బాలినేని సంచలనం!
భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు ఆమె సవతి తండ్రి , సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు పేరును ఉపయోగించుకున్నారనేది ప్రధాన ఆరోపణ.ఈ నేపథ్యంలో సూత్రధారుల పాత్ర గుర్తించే దిశగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. అప్పటి వరకు నిందితుల కాలమ్ లో అనుమానితులుగా అన్‌నోన్ పబ్లిక్ సర్వేంట్లు,ప్రైవేట్ పర్సన్స్ పదాలను పేర్కొంది. దాంతో ఈ కేసులో అనుమానితులుగా భావించిన ఎవరికైనా సీబీఐ సమన్లు ఇవ్వచ్చని తెలుస్తోంది.
ఈ ముమ్మర దర్యాప్తు నేతలు, బ్యూరోక్రాట్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కొందరు వ్యక్తులు సిండికేట్ లా ఏర్పడి ఈ దందాను నడిపిస్తున్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తదుపరి దర్యాప్తు నిమిత్తం సీబీఐకి ఫిర్యాదు చేసింది.బంగారం అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా బెంగళూరుసహా అనేక చోట్ల దాడులు చేపట్టింది. రాజధానిలోనే ఎనిమిదిచోట్ల సోదాలు చేసినట్లు సమాచారం.ఈ రాకెట్ లో భారీ కుట్రదాగి ఉన్నట్లు అనుమానిసత్ఉన్న ఈడీ ఆ దిశగాదర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే రన్యా పెళ్లికి సీఎం కూడా హాజరైన విషయాన్ని మీడియా ప్రశ్నించగా..ఆయన వేల వివాహాలకు హాజరయ్యారంటూ కర్ణాటక హోంమంత్రి ఆగ్రహంగా సమాధానమివ్వడం గమనార్హం.
Also Read: Pawan kalyan: నేను ఒక్కడినే.. భయం అంటే తెలీదు.. అదే నా కవచం!