/rtv/media/media_files/2025/01/28/y5eein2DRuod1H9lfB4p.jpg)
Infosys Co-Founder Goplakrishnan
ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నా కులాల కుమ్ములాట తప్పడం లేదు. పెద్ద హోదాల్లో ఉన్నా కూడా...వారు సాధించినదాన్ని బట్టి కాక కులాన్ని బట్టి మనుషులను గౌరవిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడితో పాటూ మరో 17 మందిపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నయోదవ్వడం. ఐఐఎస్సీలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న దుర్గప్ప..ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) మాజీ డైరెక్టర్ బలరామ్‌తో పాటు మరో 16 మందిపై ఫిర్యాదు చేశారు. 2014లో తనను హనీ ట్రాప్ కేసులో అన్యాయంగా ఇరికించడమే కాకుండా తనపై కులపరమైన విమర్శలతో బెదిరింపులకు పాల్పడ్డారని దుర్గప్ప చెప్పారు. హనీ ట్రాప్ కేసు వలన తన ఉద్యోగం పోయిందని ఫిర్యాదులో తెలిపారు.
Also Read: USA: ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని
Also Read : పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం
బెంగళూరు సదాశివనగర్ లో..
దుర్గప్ప గిరిజన బోవి కమ్యూనిటీకి చెందిన మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్. ఈయన ఫిర్యాదు మేరకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఐఐఎస్‌సీ (IISC) మాజీ డైరెక్టర్, మిగతా 16మంది పై 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు నగరంలోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇందులో గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వర్, హరి కేవీఎస్, దాసప్ప, బలరామ్ పీ, హేమలతా మిషీ, ఛటోపాద్యాయ కే, ప్రదీప్ డీ సావ్కర్ తో పాటు మనోహరన్ లు ఉన్నారు. అయితే దీనిపై ఎవరూ ఇప్పటివరకూ స్పందించలేదు. ఐఐఎస్‌సీ అధ్యాపకుల గానీ, ట్రస్టీస్ సభ్యుడిగా విధులు నిర్వహిస్తున్న గోపాలకృష్ణన్ కానీ ఎవరూ స్పందించలేదు.
Also Read: ISRO: సెంచరీ కొట్టనున్న ఇస్రో..రేపే ప్రయోగం
Also Read : Suryapet Murder: సూర్యాపేట పరువు హత్య కేసులో ఇద్దరు అరెస్టు! అమ్మాయి అన్నయ్యే..