/rtv/media/media_files/2026/04/06/bsf-2026-04-06-15-24-52.jpg)
BSF Mulls Using Snakes, Crocodiles In Riverine Gaps Along Bangladesh Border To Curb Infiltration
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమ వలసలు జరుగుతున్నాయే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే సరిహద్దుల వద్ద చొరబాటుదారులకు చెక్ పెట్టేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టనుంది. సరిహద్దులోని నదీ పరివాహక ప్రాంతాల్లో పాములు, మొసళ్లను వదలాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో పరిశీలించాలని BSF తన ప్రాంతీయ ప్రతిపాదనలు పంపించినట్లు జాతీయ మీడియా సంస్థల వెల్లడించాయి.
Also Read: పార్టీలో చేరగానే X కేటగిరీ భద్రత.. BJP రాజకీయాల్లో టెన్నిస్ స్టార్ కొత్త ఇన్నింగ్స్!
అయితే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొసళ్లు, పాములు వదలాలనే నిర్ణయం వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని.. దీన్ని అమలు చేయడంలో సవాళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ముందుగా పాములు, మొసళ్లను సేకరించాలని.. ఆ తర్వాత నదీతీర ప్రాంత ప్రజలపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేయాలని పేర్కొ్న్నారు.
Also Read: మృత్యుంజయురాలు.. ఒక్క నీళ్ల బాటిల్‌తో అడవిలో ఒంటరిగా నాలుగు రోజులు
బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్నటువంటి సరిహద్దు అనేది రక్షణపరంగా BSF బాధ్యత వహిస్తుంది. అయితే బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి స్మిగ్లింగ్, చొరబాటు కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీటికి చెక్ పెట్టడం కోసం కొన్ని మార్గాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి వరద ముప్పు ఉంటుంది. దీనివల్ల ఫెన్సింగ్ వేయడం అనేది కష్టతరంగా మారింది. అక్కడ జనాభా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫెన్సింగ్‌కు ప్రత్యామ్నాయంగా పాములు, మొసళ్లు ఉంచాలనే ఆలోచన ఉన్నా కూడా సరిహద్దు ఇరువైపులా ఉండే ప్రజలకు ఇది ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. వరదలు వచ్చిన సమయంలో ఇవి జనావాసా ప్రాంతాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఆలోచనపై అధికారులు పరిశీలనలు చేస్తున్నారు.
Follow Us