/rtv/media/media_files/2026/03/28/noida-2026-03-28-20-50-53.jpg)
Bought a chopper, planning Thailand trip, Noida farmer after 15 crores airport land deal
ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మొదటి దశను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విమానశ్రయం కోసం సేకరించిన భూములకు భారీగా పరిహారం అందినట్లు సమాచారం. దీనివల్ల యూపీలోని పలువురు రైతుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయినట్లు తెలుస్తోంది. పలు జాతీయ మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం పశ్చిమ యూపీలోని ఓ రైతుకు రూ.15 కోట్ల పరిహారం అందింది. ఈ డబ్బులతో ఆయన ఓ హెలికాప్టర్‌ను కొన్నాడు. అలాగే థాయ్‌లాండ్‌లో టూర్ వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కిశోర్‌పూర్ అనే గ్రామానికి చెందిన అజయ్ బేనివాల్ వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవాడు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు పనులకు వచ్చే కూలీలు తమ హల్మెట్లు, తాళాలు భద్రపరుచుకునేలా ఓ చిన్న సర్వీస్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఈ పనివల్ల అతడికి నెలకు రూ.60 ఆదాయం వస్తోంది.
Also Read: మిడిల్ ఈస్ట్ టెన్షన్: రంగంలోకి దిగిన మోదీ..సౌదీ ప్రిన్స్‌తో ఫోన్ కాల్
నానక్ చంద్ (56) అనే వ్యక్తి వలస కూలీలకు అద్దె ఇచ్చేందుకు తన ఇంట్లో ఆరు అదనపు గదులను కట్టించాడు. ఎయిర్ పనులు కొనసాగినప్పుడు అతనికి ఈ రూమ్‌ల నుంచి మంచి ఆదాయం వచ్చేది. ప్రస్తుతం విమాన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడం వల్ల కూలీల సంఖ్య తగ్గిందని చెబుతున్నాడు.
ఇదిలాఉండగా రైతులు తమకు వచ్చే ఆదాయాన్ని ఖర్చు చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ముల్షీ ప్రాంతానికి జరిగిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇక్కడ కూడా గతంలో రైతులు తమకు వచ్చిన పరిహారంతో విలాసవంతమైన కార్లు కొన్నారని చెబుతున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పెట్రోల్ పోయించుకునేందుకు కూడా ఇబ్బందులు పడ్డారని అంటున్నారు. పరిహారం నుంచి వచ్చే డబ్బును తెలివిగా ఖర్చు పెట్టాలని లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు.
Follow Us