![Resons Behind BJP Victory in Delhi Assembly Elections](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/08/OMfcibOY3yqozmIJP3Dk.jpg)
Resons Behind BJP Victory in Delhi Assembly Elections
మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ఇండియా టుడే నిర్వహించిన ఈ సర్వేలో ఎన్డీయే కూటమే ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. ఇండియా టుడే-సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌ను జనవరి 2 మరియు ఫిబ్రవరి 9, 2025 మధ్య నిర్వహించింది. అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1, 25 123 మంది వోటర్లను సర్వే చేసింది. ఇందులో వచ్చిన ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 293 సీట్లు గెలుచుకుంది ఎన్డీయే. అయితే ఇందులో బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయింది. దీంతో మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ మద్దతుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 400 సీట్లు వస్తాయన్న ఎన్డీయే కూటమికి, మ్యాజిక్ ఫిగర్ 272 కన్నా కొన్ని సీట్లు మాత్రమే అధికంగా గెలుచుకో గలిగింది. అయితే తాజా పోల్ ప్రకారం..ఎన్డీయే, బీజేపీ ఈ పరిస్థితి నుంచి మెరుగుపడ్డాయని తెలుస్తోంది. అప్పటి నుంచి మరో 3 శాతం పాయింట్లు పెరిగి ఎన్డీయే కూటమికి ఓట్ల శాతం 47 శాతానికి చేరుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఇండియా కూటమికి మాత్రం 1 శాతం ఓట్లు తగ్గుతాయని చెప్పింది.
Also Read: Cricket: మూడో మ్యాచ్ లోనూ విజయం..ఇంగ్లాండ్ తో వన్డే సీరీస్ క్లీన్ స్వీప్
కాంగ్రెస్ డౌన్ ఫాల్..
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి సొంతంగా 281 సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ 99 నుంచి 78 సీట్లకు పడిపోతుందని అంచనా వేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 188 సీట్లకు పడిపోతుందని చెప్పింది.
Also Read: USA: ఐదేళ్ళ తర్వాత కలుస్తున్న ట్రంప్, ప్రధాని మోదీ...కీలక అంశాలపై చర్చ!