Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీ అతను చేసిన వ్యాఖ్యలపై అవి మండిపడుతున్నాయి. తుషార్ గాంధీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఆర్ ఎప్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి. 

author-image
By Manogna alamuru
New Update
gandhi

Tushar Gandhi, Mahatma Gandhi Grandson

మహాత్మాగాంధీ మనువడు తుషార్ గాంధీ. ఆయన రీసెంట్ గా కేరళ రాజధాని తిరువనంతపురంలోని నెయ్యంట్టికరలో గాంధీ సిద్ధాంతవాది పి.గోపీనాథన్ నాయకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో తుషార్ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల మీద విమర్శలు చేశారు. అవి రెండూ సమాజానికి ప్రమాదకరమని, శత్రవులని తుషార్ గాంధీ మాట్లాడారు,  ఆర్ఎస్ఎస్ అయితే క్యాన్సర్ లాంటిది అని..అది నిలువెల్లా విషం నింపుకుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

తగ్గేదే లేదు..

తుషార్ గాంధీ ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.  స్థానిక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు తుషార్‌ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన్ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మహాత్మా గాంధీ వారసుడిగా ఆయన అనుకోకుండా జన్మించారు. తన ముత్తాత పేరు ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని తుషార్ గాంధీపై బీజేపీ ఎదురు దాడి చేసింది. గాంధీ పేరు ఉపయోగించుకొని చాలా ఏళ్లుగా తుషార్ భారీగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు వి. మురళీధరన్ ఆరోపించారు. కేరళలో ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మరోవైపు తుషార్ గాంధీ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. వాటిని ఉపహరించుకోవడం కానీ, క్షమాపణలు అయితే అసలే చెప్పనని అన్నారు. ఈ సంఘటన ద్వారా దేశ ద్రోహులను బయటపెట్టాలనే నా సంకల్పం మరింత దృఢంగా తయారయ్యిందని తుషార్  అన్నారు. ఇప్పుడు జరిగేది స్వాతంత్ర పోరాటం కంటే చాలా ముఖ్యమైన పోరాటం. మనందరికీ ఇప్పుడు ఉన్న ఉమ్మడి శత్రులు సంఘ్ పరివార్. వారి ద్రోహాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని తుషార్ గాంధీ స్పష్టం చేశారు. 

Also Read: Whats App: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..మెసేజ్ త్రెడ్స్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment