Nagpur violence : మహారాష్ట్రను మరో మణిపూర్‌లా చేయాలని BJP ప్లాన్: ఆదిత్య ఠాక్రే

మహారాష్ట్రని మరో మణిపూర్‌‌లా మార్చాడమే BJP ప్లాన్ అని శివసేన లీడర్ ఆదిత్య ఠాక్రే అన్నారు. నాగ్‌పూర్‌ హింసపై ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపించడం చేతకాకుంటే BJP హింస, అల్లర్లు సృస్టింస్తుందని ఆరోపించారు. BJP ప్రతి చోటా ఇదే ఫార్ములా ఫాలో అవుతుందన్నారు.

New Update
Nagpur violence

Nagpur violence Photograph: (Nagpur violence)

నాగ్‌పూర్ హింసపై శివసేన యుబిటి నాయకుడు ఆదిత్య ఠాక్రే స్పందించారు. బీజేపీ పాలించలేనప్పుడు అక్కడ ఆ పార్టీ హింస, అల్లర్లు స‌ృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతి రాష్ట్రంలోనూ వారి సెట్ ఫార్ములా ఇదేని ఆదిత్య ఠాక్రే అన్నారు. మహారాష్ట్రని మణిపూర్‌గా మార్చాలని బీజేపీ ప్లాన్ చేసిందని ఆయన అన్నారు. గతకొంతకాలంగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. వందల సంవత్సరాల క్రితం చరిత్రను తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ బీజేపీ భవిష్యత్తు గురించి మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ఈ సంఘటన మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్వస్థలంలో జరిగినందున బిజెపికి దీని గురించి సిగ్గు లేదని మండిపడ్డారు.  

నాగ్‌పూర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అల్లర్ల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధిని తొలగించాలని కొందరు ఆందోళనాకారులు ఇళ్ళు, రోడ్లపై కార్లుద్వంసం చేశారు. వాహనాలను తగలబెట్టారని ప్రత్యేక సాక్షులు పోలీసులుకు వివరించారు. పోలీసులు టైంకు రాకపోవడం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని వారు ఆవేదన చెందారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ర్యాలీ నిర్వహించింది.

Also read: Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ!

ఛావా సినిమా విడుదల కారణంగా మరాఠాలు ఆవేశానికి గురై ఉద్యమించారు. ఔరంజేబు ఫొటో కాల్చివేశారు. సెంట్రల్ నాగ్‌పూర్‌లోని చిట్నిస్ పార్క్‌లో సోమవారం రాత్రి 7:30 గంటలకు హింస చెలరేగింది. ఈ సమయంలో పోలీసులపై రాళ్లు రువ్వగా, అనేక మంది గాయపడ్డారు. 25 మంది పోలీసులకు కూడా గాయాలైయ్యాయి. అల్లర్లపై 5 కేసులు ఫైల్ చేశామని నాగ్‌పూర్ సీపీ రవీందర్ సింగల్ మీడియాకు తెలిపారు. ప్రజలందరూ పుకార్లు నమ్మకుండా.. శాంతిగా ఉండాలని ఆయన కోరారు.

Also read : ADR report: ఓటేసి నేరస్తులని అసెంబ్లీకి పంపిస్తున్నామా..? 45శాతం MLAలపై క్రిమినల్ కేసులు.. టాప్‌లో AP!

చిట్నిస్ పార్క్ సమీపంలోని ఓల్డ్ హిస్లాప్ కాలేజీ ప్రాంతంలోకి ఓ గుంపు ప్రవేశించి 4 కార్లను ధ్వంసం చేశారు. ఇళ్లపైకి రాళ్లు రువ్వారు. ఈ అల్లర్లకు ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గవర్నమెంట్‌పై అపవాదలు వేయడానికి ప్రతిపక్ష ప్లాన్ ప్రకారం ఈ అల్లర్లు చేయించిదని మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే అన్నారు. పోలీసులపై దాడికి దిగిన వారిని ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని మంత్రి తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు