BJP Manifesto: మహిళలకు నెలకు రూ.2 వేలు, ఏడాదికి మూడు సిలిండర్లు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

మరికొన్ని రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలకు నెలకు రూ.2 వేలు, ప్రతి ఏడాది ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది.  

New Update
BREAKING

BREAKING

BJP Manifesto: మరికొన్ని రోజుల్లో తమిళనాడులో(Tamilnadu) అసెంబ్లీ ఎన్నికలు(Elections) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలకు నెలకు రూ.2 వేలు, ప్రతి ఏడాది ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది.  

మేనిఫెస్టో హామీలు 

1.మహిళలకు నెలకు రూ.2 వేలు
 2.ప్రతి ఏడాది ఉచితంగా మూడు సిలిండర్లు
3.అర్హులైన మహిళలకు ఈ-స్కూటర్ కొనుగోలుకు రూ. 25,000 సాయం 
4. ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు స్టాంప్ డ్యూటీలో మూడు శాతం రాయితీ
5.ప్రతి కుటుంబానికి ఏకకాలంలో రూ. 10,000 ఆర్థిక సాయం
6.స్వయం సహాయక సంఘాలు, MSME లకు రూ. 50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 
7.విద్యార్థినులు, మహిళల భద్రత కోసం బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు

Also Read: అంబేద్కర్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ.. మల్లికార్జున్ ఖర్గేతో ముచ్చట్లు.. VIDEO

8. జీరో ఎఫ్ఐఆర్ విధానం అమలు 
9.నేర విచారణలు వెంటనే జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు 
10. తమిళుల ఆత్మగౌరవానికి ప్రతీకైన ‘జల్లికట్టు’కు పూర్తి మద్దతు
11.ఎద్దులను పెంచే వారికి నెలకు రూ. 2,000 సాయం, ఒకవేళ ఆటలో పాల్గొనే వ్యక్తి మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా
12.రైతులకు కేంద్ర సాయానికి అదనంగా మరో రూ. 3,000 (మొత్తం రూ. 9,000) 

ఇదిలాఉండగా తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు