ఇక్కడ కేసీఆర్, అక్కడ కేజ్రీవాల్.. ఇద్దర్నీ దెబ్బ కొట్టింది ఆ ఒక్కటే!

ఆప్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమ్ అద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిందని ఈ స్కామ్ లో ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ లాంటి నేతలు అరెస్ట్ కావడం ఓటమికి కారణంగా చెబుతున్నారు.

New Update
kejriwal and kcr

kejriwal and kcr

దేశ రాజధానిలో నాలుగో సారి అధికారం చేపట్టాలనుకున్న  ఆమ్ అద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది. 44 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా ఆప్ కేవలం 25 స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. దాదాపుగా ఆప్ ఓటమి ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆప్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమ్ అద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిందని చెబుతున్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ అగ్రనేతలు మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ లాంటి నేతలు అరెస్ట్ కావడం ఆప్ పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దూరం చేసిందని భావిస్తున్నారు.  ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె  కవితను కూడా ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేశాయి. ఈ కేసు వ్యవహరం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారి బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంలో కీ రోల్ పోషించింది. బీజేపీతో ఢీ అంటే ఢీ అన్న కేసీఆర్,  కేజ్రీవాల్ లు అధికారానికి దూరం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన అగ్ర నేతలందరూ దాదాపుగా బెయిల్ పై రిలీజ్ అయ్యారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు