/rtv/media/media_files/2025/02/18/HQGmUEV2RB2ZwrZi10pQ.jpg)
Encounter in Bihar
Encounter in Bihar: బీహార్ రాజధాని పాట్నా(Patna)లో తూటాలు పేలడం కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల(Gangsters vs Police) మధ్య కాల్పులు జరిగాయి. నలుగురు గ్యాంగ్‌స్టర్ల కోసం పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న దుండగులు.. పోలీసులను చూసి కాల్పులు జరిపారు. అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం రామ్‌లఖన్ మార్గ్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోని నాలగవ అంతస్తులోకి చొరబడ్డారు. వాళ్లని లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా పట్టించుకోలేదు.
Also Read: కేంద్రం సంచలన ప్రకటన.. బీపీ, షుగర్, క్యాన్సర్ టెస్టులు ఫ్రీ
STF బలగాలు కూడా రంగంలోకి
ఆ ప్రాంతంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య కాల్పులు జరగడంతో అక్కడున్న దుకాణాలు మూసివేయించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరించారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు బిల్డింగ్‌లపై ఎక్కి చూస్తున్నారు. మరోవైపు దుండగుల కోసం STF బలగాలు కూడా రంగంలోకి దిగాయి. బీహార్ ATS బలగాలు కూడా అక్కడికి వచ్చాయి. అయితే దుండగుల వద్ద అధునాతన ఆయుదాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్
పాట్నాలో కంకర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ఇంట్లో రెండు వైపుల కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుండుగలు ప్రవేశించిన ఆ ఇల్లు ఉపేంద్ర సింగ్ అనే వ్యక్తికి చెందినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం దుండగుల కోసం బలగాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.
Also Read: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్
Also Read: అశ్లీల కంటెంట్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు