/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/10th-jpg.webp)
Bihar government bumper offer to 10th class students
Bihar: పదవ తరగతి విద్యార్థులకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2025 టాప్ 3 ర్యాంకర్లకు రూ.2 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ల్యాప్‌టాప్, సర్టిఫికెట్, మెడల్ కూడా అందిస్తామని తెలిపింది. టాప్ 4-10 పది నుంచి ఇరవై వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
భారీగా పెంచిన ప్రైజ్ మనీ..
ఈ మేరకు గత సంవత్సరం కంటే ఈ ఏడాది ప్రైజ్ మని పెంచినట్లు తెలిపింది. అలాగే 10, 12 తరగతుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను బోర్డు ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం వీరికి బీహార్ విద్యాశాఖ బోర్డు అవార్డులను కూడా అందించనున్నట్లు అనౌన్స్ చేసింది. ఇక మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. 2 లక్షలు, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.1.5 లక్షల ప్రైజ్ మనీ, మూడవ స్థానంలో నిలిచిన విద్యార్థులకు లక్ష రూపాయలు అందుతాయి. దీనితో పాటు నాల్గవ స్థానం నుంచి పదో స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ. 10 నుంచి 30 వేల బహుమతి ఇవ్వబడుతుంది. ఇక గత సంవత్సరం మొదటి ప్రైజ్ మనీ లక్ష మాత్రమే అందించగా ఈసారి భారీగా పెంచింది.
ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
మొదటి స్థానం: 1 లక్షకు బదులుగా 2 లక్షలు.
రెండవ స్థానం: 75,000 నుంచి 1.5 లక్షలకు పెరిగింది.
మూడవ స్థానం: 50,000 నుంచి 1 లక్షకు పెరిగింది.
నాల్గవ నుండి 10వ స్థానం: ₹10,000 నుంచి ₹20,000కి పెరిగింది.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
10th-class | prize-money | today telugu news