/rtv/media/media_files/2025/02/13/dPA9f9DUUYL4YeXiZUHA.jpg)
congress party poll
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) ఫలితాలు నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ (Mood Of The Nation) సర్వేలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సర్వేలో ఉత్తమ ప్రధాని ఎవరు, కాంగ్రెస్‌కు ఉత్తమ నాయకుడు ఎవరు మొదలైన అనేక ప్రశ్నలు ప్రజలను అడిగారు. ఈ సర్వే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 మధ్య జరిగింది. మొత్తం లక్ష 25 వేల 123 మంది సర్వేలో పాల్గొన్నారు. అయితే సర్వేలో పాల్గొన్న వారిలో 64.4 శాతం మంది కాంగ్రెస్ దేశానికి నిజమైన ప్రతిపక్ష పార్టీ అని నమ్ముతుండగా, 31 శాతం మంది కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించడంలో విఫలమైందని ఓటు వేశారు. అంతేకాకుండా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ పనితీరును 24.8 శాతం మంది చాలా బాగుందని భావించగా.. 26.9 శాతం మంది బాలేదని ఓటు వేశారు.
Also Read : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
కాంగ్రెస్‌ను ఎవరు బాగా నడపగలరు?
సర్వేలో అడిగిన మరో ప్రశ్న ఏమిటంటే కాంగ్రెస్ (Congress) ను ఎవరు బాగా నడపగలరు? ఇందులో మొదటి ఎంపికగా రాహుల్ గాంధీకి36.4 శాతం మంది మద్దతు తెలుపగా.. ప్రియాంక గాంధీని 11.2 శాతం మంది ఓటు వేశారు. ఆశ్చర్యకరంగా సర్వేలో, ప్రస్తుత అధ్యక్షుడు ఖర్గే కంటే సచిన్ పైలట్ కాంగ్రెస్‌ను నడపడానికి మంచి ఎంపికగా సూచించారు. సర్వేలో,8.4 శాతం మంది పైలట్‌కు మద్దతుగా ఓటు వేయగా, 2.7 శాతం మంది మాత్రమే ఖర్గేకు ఓటు వేశారు.
Also Read : కీమోథెరపీ వల్ల కనురెప్పలు కూడా రాలిపోతాయా?
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ నుంచి రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. అప్పటి నుండి ఆయన సభలో కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారు. 2014 ,2019 తో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ పనితీరు చాలా మెరుగుపడింది. ఈ కారణంగానే బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును చేరుకోలేక పోయింది. కేవలం 244 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఈ క్రమంలో కూటమి పార్టీలతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Also Read : మీరు విదేశాలకు వెళ్తే తిరిగొస్తారన్న నమ్మకం లేదు..ఇంద్రాణీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
ఎన్డీఏ కూటమిదే అధికారం
ఇక ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటన్న దానిపై కూడా సర్వే జరగగా ఇందులో కూడా కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పడు ఎన్నికలు జరిగితే మరోసారి ఎన్డీఏ కూటమిదే అధికారమని సర్వేలో తేలింది. ఎన్డీఏ కూటమి 343 సీట్లు గెలిచే అవకాశం ఉందన్న సర్వే అభిప్రాయపడింది. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే కూటమికి 44 సీట్లు పెరిగే ఛాన్స్ ఉందని తెలుపగా.. ఇండియా కూటమి 44 సీట్లు కోల్పోతుందని సర్వే అంచనా వేసింది. 2024లో 232 ఎంపీ స్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంది. ఓట్ల శాతంలోనూ ఎన్డీఏ కూటమికి 5 శాతం పెరిగే ఛాన్స్ ఉందని తెలుపగా. . ఇండియా కూటమికి 3 శాతం ఓట్లు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది.
Also Read : లేడీ దొంగలు... అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ నిలువు దోపిడీ!