/rtv/media/media_files/2026/03/26/bengaluru-professor-proposes-to-student-in-classroom-2026-03-26-18-45-43.jpg)
Bengaluru professor proposes to student in classroom
బెంగళూరులోని ఓ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ పాఠాలు చెప్పే ఓ ప్రొఫెసర్.. క్లాస్‌రూమ్‌లోనే ఒక విద్యార్థినికి లవ్ ప్రపొజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కాలేజీలో క్లాస్ జరగుతుండగా మొహమ్మద్ అనే ప్రొఫెసర్ మైక్ పట్టుకొని ఓ విద్యార్థినిపై తన ప్రేమ గురించి మాట్లాడాడు. ఆమెకు తనకు లవ్ ప్రపోజ్ చేసినట్లు అందరిముందు తెలిపాడు. దీంతో తాను కూడా ఆమెను లవ్ చేస్తున్నట్లు చెప్పాడు. కానీ దీన్ని ఆ విద్యార్థిని వ్యతిరేకిచడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Movie type proposal in #Bengaluru!
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 26, 2026
A professor proposes to a student in the classroom of a medical college at T Begur in Nelamangala. The girl takes objection.
A few moments later: The girl & fellow students thrash the professor. @timesofindiapic.twitter.com/ohsFTxUj5J
Also Read: పెట్రోల్, డీజిల్ కొరతపై కేంద్రం సంచలన ప్రకటన
ఆ వీడియోలో ప్రొఫెసర్ నువ్వు నాకు ప్రపోజ్ చేశావు కదా అన్నాడు. దీనికి ఆమె స్పందిస్తూ నేనెప్పుడు చేశాను, ఆధారాలు చూపించండి అంటూ నిలదీసింది. సీసీటీవీ ఫుటేజీ ఉంది.. కావాలంటే చూసుకోండని అతడు గట్టిగా వాదించాడు. దీంతో ఆమె కోపంతో ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దగ్గర తేల్చుకుందాం, క్లాస్ అందరూ వస్తారని చెప్పింది. ఈ విషయంపై రేపు మాట్లాడుకుందాం అని ప్రొఫెసర్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Also Read: హర్మూజ్ జలసంధిపై పట్టు కోల్పోయిన ఇరాన్.. నావీ చీఫ్ మృతి
ఆ తర్వాత ఇతర విద్యార్థులు కూడా ప్రొఫెసర్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేఏశారు. ఆమె ప్రొఫెసర్‌ను చెప్పుతో కొట్టడంతో క్యాంపస్‌లో గందరగోళ వాతావణం ఏర్పడింది. చివిరికీ సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు పరిశీలిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఆ ప్రొఫెసర్‌పై మండిపడుతూ విమర్శలు చేస్తున్నారు.
Follow Us