/rtv/media/media_files/2026/03/29/bengaluru-2026-03-29-16-31-40.jpg)
Bengaluru Jail Inmates Seen Using Mobile Phones, TV
కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ఆ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు, టీవీలు వాడుతున్నట్లు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఖైదీలు జైల్లో విలాసవంతమైన జీవితం గడుడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై తీవ్రంగా విమర్శలు రావడంతో జైలు అధికారులు చర్యలు దిగారు. ముగ్గురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
Also Read: దూసుకుపోతున్న మహిళలు.. పురుషుల కన్నా ఎక్కువ జీతాలు వీళ్లకే.. రిపోర్టులో సంచలన విషయాలు
ఓ హత్య కేసులో రెండున్నర ఏళ్లకు పైగా జైల్లో ఉన్న ఖైదీలు మార్చి 27న వీడియో రికార్డు చేశారు. తమ స్నేహితులకు దీన్ని పంపించారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో జైలు అధికారులు అలెర్ట్ అయ్యారు. ఖైదీల గదుల్లో చెక్ చేశారు. టాయిలెట్ సమీపంలో భూగర్భ పైప్‌లైన్ ప్రాంతంలో ఫోన్లను దాచినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ముగ్గురు జైలు వార్డెన్లను సస్పెండ్ చేశారు.
Parappana Agrahara twist 🚨
— Gk (@Ggk_here_) March 29, 2026
Viral jail “luxury” video now exposed as staged conspiracy to target DGP Prisons Alok Kumar after crackdown.
3 wardens suspended for negligence as probe tightens.pic.twitter.com/LZzpPldYRW
Also Read: టీవీకే అభ్యర్థుల లిస్టు విడుదల.. రెండుచోట్ల నుంచి బరిలోకి విజయ్
ఇదిలాఉండగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్‌లో ఖైదీల అక్రమ కార్యకలపాలు నియంత్రించేందుకు గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నామని జైలు అధికారులు చెప్పారు. తమ ప్రయత్నాలు దెబ్బతీసేందుకే ఈ వీడియోను బయటపెట్టారని తెలిపారు. జైళ్ల డీజీపీ అలోక్ కుమార్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏదైనీ కుట్ర జరుగుతుందా అనేదానిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది కూడా ఈ జైల్లో ఖైదీలు మొబైల్ ఫోన్లు, టీవీలు వాడుతున్నారంటూ పలు వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Follow Us