/rtv/media/media_files/2026/02/20/visa-services-with-india-2026-02-20-16-44-08.jpg)
బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ మార్పుల తర్వాత, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్ళీ చిగురిస్తున్నాయి. కొత్తగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ భారత్‌తో సంబంధాలను మెరుగుపరిచే దిశగా కీలక అడుగు వేశారు. గత రెండు నెలలుగా నిలిచిపోయిన వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు(Bangladesh new Prime Minister | Tarique Rahman's swearing). దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న మనస్పర్థలు తొలగిపోనున్నాయి.
బంగ్లాదేశ్ కొత్త సర్కార్ నిర్ణయంతో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లో శుక్రవారం నుంచి వీసా మంజూరు తిరిగి ప్రారంభమైంది. టూరిజం, మెడికల్, బిజినెస్ వంటి అన్ని విభాగాల్లో భారతీయులకు వీసాలు జారీ చేయనున్నారు. భారత్‌లోని బంగ్లా రాయబార కార్యాలయంలో సేవలు మొదలైనట్లే, త్వరలోనే ఢాకాలోని భారత రాయబార కార్యాలయంలో కూడా బంగ్లాదేశీయులకు వీసా సేవలు అందుబాటులోకి వస్తాయని భారత రాయబార కార్యాలయ అధికారి అనిరుద్ధా దాస్ వెల్లడించారు.
గత ఏడాది డిసెంబర్ నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ యూనస్ తాత్కాలిక గవర్నమెంట్లో ఇండియా వ్యతిరేక విధానాలు అవలంభించారు.
Also Read : 5ఏళ్లుగా మహిళ కడుపులో కత్తెర.. ఆపరేషన్ చేసిన డాక్టర్ షాకింగ్ సమాధానం
Tarique Rahman Restores Visa Services With India
హిందువులపై దాడులు: మూడు నెలల క్రితం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులు, అశాంతి పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా వీసా సేవలను నిలిపివేశారు.
షేక్ హసీనా అప్పగింత డిమాండ్: భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేయడం కూడా ఉద్రిక్తతలకు దారితీసింది.
తారిఖ్ రహమాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం 3 రోజుల్లోనే భారత్ పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరై, ప్రధాని మోదీ పంపిన ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నేపథ్యంలో పొరుగున ఉన్న భారత్ సహకారం ఆ దేశానికి ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో వీసా పునరుద్ధరణ అనేది రెండు దేశాల మధ్య వ్యాపార, వైద్య మరియు ప్రజల మధ్య సంబంధాలను తిరిగి బలపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : ఎవరీ లేడీ డాన్ మేడం జెహర్.. పగలంతా బ్యూటీ పార్లర్, రాత్రైతే అదే పని!
Follow Us