/rtv/media/media_files/2026/02/15/bangladesh-invites-2026-02-15-12-21-13.jpg)
బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్(Tariq Rahman swearing ceremony) కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుమారు 17 ఏళ్లు విదేశాల్లో ఉండి వచ్చాక స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన, ఫిబ్రవరి 17న (మంగళవారం) ఢాకాలోని పార్లమెంటు హౌస్ 'సదరన్ ప్లాజా'లో పదవీ ప్రమాణం చేయనున్నారు.
🚨 BREAKING: Bangladesh’s BNP says Narendra Modi will be invited to attend the oath-taking ceremony of incoming PM Tarique Rahman. (Reports)
— Beats in Brief 🗞️ (@beatsinbrief) February 14, 2026
Move seen as a step to strengthen India-Bangladesh relations. 🇮🇳🇧🇩 pic.twitter.com/adUYcyne3t
Also Read : రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ క్లారిటీ.. అమెరికాకి హామీ!
మోదీకి పిలుపు
తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారంలో పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కి బంగ్లాదేశ్ అధికారికంగా ఆహ్వానం పంపింది. భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా సహా మొత్తం 13 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే, అదే సమయంలో ముంబైలో ఫ్రెంచ్ అధ్యక్షుడితో చర్చలు, ఢిల్లీలో 'AI సమ్మిట్' వంటి ముందస్తు కార్యక్రమాల వల్ల ప్రధాని మోదీ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశంపై ఇంకా స్పష్టత రాలేదు. మోదీ నేరుగా వెళ్లకపోయినా, భారత్ తరపున ఓ ఉన్నత స్థాయి మంత్రిని పంపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత కొన్నాళ్లుగా భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ స్వయంగా తారిఖ్ రెహమాన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలపడం ఒక సానుకూల పరిణామం. దీనిపై స్పందించిన తారిఖ్ రెహమాన్, తమ ప్రభుత్వం భారత్‌తో నిర్మాణాత్మక సంబంధాలనుకొనసాగిస్తుందని, పరస్పర గౌరవం ప్రాతిపదికన ముందుకు సాగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలకే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.
Also Read : ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు.. పదేళ్లలో రూ.762 కోట్లా..?
Follow Us