ED Raid: షాకింగ్ ఘటన.. ఈడీ సోదాల భయంతో రోడ్డుపై విసిరేసిన రూ.500 నోట్ల కట్టలు

పంజాబ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు చేస్తుండగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.ఈడీ దాడుల భయంతో రూ.500 నోట్ల కట్టలతో ఉన్న రెండు బ్యాగులను రోడ్డుపై పడేయడం కలకలం రేపింది.

New Update
Bags Of 500 rupees Note Bundles Thrown From Mohali Flat During ED Raid in punjab

Bags Of 500 rupees Note Bundles Thrown From Mohali Flat During ED Raid in punjab

పంజాబ్‌(punjab) లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు చేస్తుండగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.ఈడీ దాడుల భయంతో రూ.500 నోట్ల కట్టలతో ఉన్న రెండు బ్యాగులను రోడ్డుపై పడేయడం కలకలం రేపింది. ఆ తర్వాత ఓ వాహనంలో వేగంగా వచ్చిన డ్రైవర్ ఆ బ్యాగులను తీసుకొని అక్కడినుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు, అధికారులు విచారణ చేస్తున్నారు. 

Also Read: బెంగాల్ ఎన్నికల రక్త చరిత్ర.. ఒకటి కాదు రెండు కాదు.. వందలమంది దారుణ హత్య!

ED Raid In Punjab

ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్‌ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (GMADA)లో భూవినియోగ పర్మిషన్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో ఉన్న నితిన్‌ గోహల్‌ అనే వ్యక్తికి.. పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌కు ఓఎస్డీగా ఉన్న రజబీర్ ఘుమాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి పంజాబ్, చండీగఢ్‌లోని పలువురు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో గురువారం ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు(ED Raid) చేశారు. 

Also Read: విజయ్‌కు చుక్కలు చూపిస్తున్న గవర్నర్.. ఎవరీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్?

ఈ నేపథ్యంలోనే మొహాలీలోని ఖరార్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోకి అధికారులు వచ్చారు. దీంతో ఎవరో గుర్తుతెలియని వాళ్లు తొమ్మిదో అంతస్తు నుంచి రూ.500 నోట్ల కట్టలతో ఉన్న రెండు బ్యాగులను కిందకి విసిరారు. అదే సమయంలో ఓ వాహనం అక్కడికి వచ్చింది. దీంతో డ్రైవర్‌ వాటిని తీసుకొని అక్కడినుంచి పారిపోయాడు. నోట్ల కట్టలతో ఉన్న బ్యాగు దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు