/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/anand-mahindra-jpg.webp)
Anand Mahindra:
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎన్నో ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా భారత్ లోకి ఎంట్రీ పై సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. దీని పై ఓ నెటిజన్ స్పందిస్తూ..టెస్లా మార్కెట్ లోకి వస్తే ఎదురయ్యే పోటీని ఎలా ఎదుర్కొంటారని మహీంద్రాను ప్రశ్నించారు.
పోటీని తట్టుకొని...
దీనికి ఆయన స్పందిస్తూ 1991 లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తరువాత కూడా తమకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయని పేర్కొన్నారు. అప్పుడు మార్కెట్ లోకి వచ్చిన దేశీయ, విదేశీ కంపెనీలైన టాటా, సుజుకీ వంటి ఎన్నో ఇతర కంపెనీలతో పోటీని తట్టుకొని నిలబడ్డామన్నారు. తమ ఉత్పత్తుల పై ఉన్న నమ్మకమే దీనికి కారణమని..టెస్లా మార్కెట్ లోకి వచ్చినా తమ సంస్థ ఇదే విధంగా ముందుగా వెళ్తుందని అన్నారు.
Also Read: Gautham Death Mystery: అల్లుడికి నిప్పంటించిన అత్తామామ! గౌతమ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్
దేశ ప్రజలు, వినియోగదారులు ఇస్తున్న ప్రోత్సాహంతో పోటీకి తగ్గట్లు తమను తాము మార్చుకుంటామన్నారు. 2018 సమయంలో ఎలాన్ మస్క్ (Elon Musk) సంస్థలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయనకు మద్దతిస్తూ పెట్టిన పోస్ట్‌ను షేర్ చేసి..అప్పుడెలా ఆయనకు మద్దతు ఇచ్చానో ఇప్పుడు కూడా అలాగే ఉంటానని పేర్కొన్నారు.
మహీంద్రా సమాధానం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహీంద్రా ఆటో మొబైల్స్ కు మార్కెట్లో ఉన్న విలువకు కారణం... సంస్థ పాటించే ఆరోగ్యకర పోటీ విధానం మాత్రమే అని ఓ నెటిజన్ అన్నారు. మహీంద్రా కంపెనీ భారతదేశపు వాస్తవికతను, భారతీయుల మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న సంస్థ. కాబట్టి భారత్ లో దీని పునాది గట్టిగా ఉంది.
మార్కెట్ లో ఆరోగ్యకరమైన వాతావరణ లేకపోతే...కొత్త ఆవిష్కరణలు చేయలేం అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు.
Also Read:Mamata Benarjee: అది నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి దీదీ సవాల్
Also Read: America-Russia: అమెరికాలో ఉద్రిక్తతలకు తెర పడనుందా...రష్యా ఏమంటుందంటే!