/rtv/media/media_files/2025/03/20/ODFonpFrprCAaLQsjVFu.jpg)
Amazon Layoffs
ఈమధ్య కాలంలో దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇవ్వడం సాధారణ అయిపోయింది. తాజాగా మరో మరో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2025లో ఆరంభంలోనే దాదాపు 14 వేల మంది మేనేజర్ల ఉద్యోగాలు తొలగించనుంది. దీనివల్ల ఏడాదికి 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలయన్ డాలర్ల వరకు ఆదా చేయాలని టార్గెట్ పెట్టుకుంది. భారత కరెన్సీలో చూస్తే ఇది రూ.31 వేల కోట్లకు పైగానే ఉంది. ఈ తొలగింపుల వల్ల అమెజాన్‌లోని మేనేజ్‌మెంట్ ఉద్యోగుల్లో 13 శాతం తగ్గిపోనుంది.
Also Read: వినియోగదారులకు అలర్ట్....నాలుగు రోజులు బ్యాంక్ లు బంద్
ప్రస్తుతం ఉన్న మేనేజర్ల సంఖ్య 1.05,770 నుంచి 91,936కు తగ్గనుంది. పలు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం చూసుకుంటే.. సీఈవో ఆండీ జస్సీ కంపెనీ తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తున్నారు. 2025 మొదటి త్రైమాసికం నాటికి మేనేజర్ల కంటే ఇతర ఉద్యోగుల నిష్పత్తిని దాదాపు 15 శాతానికి పెంచాలని భావిస్తున్నారు. మేనెజ్‌మెంట్ స్థాయిలను పునర్వ్యవస్థీకరించి అమెజాన్ కార్యాలయాల్లో పనివేగాన్ని మరింత మెరుగుపరచాలని యోచిస్తున్నారు.
Also Read: మగ శిశువుకు 6 లక్షలు...ఆడ శిశువుకు 4 లక్షలు ..పసిపిల్లల విక్రయంలో బిగ్‌ట్విస్ట్
అమెజాన్ దాదాపు 13,834 మేనేజర్లను ఉద్యోగాల నుంచి తొలగించనుంది. ముఖ్యంగా ఖర్చులను తగ్గించుకనేందుకు ఇది దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది. ఉద్యోగుల తొలగింపుతో పాటు మరికొన్ని ఖర్చులను కూడా తగ్గించే మార్గాలను అమెజాన్ ప్రవేశపెట్టింది. ఇందులో బ్రూరోక్రసీ టిప్‌లైన్ కూడా ఒకటి. ఇందులో ఉద్యోగులు కార్యాలయాల్లో పనికిరాని విధానాల గురించి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే సీనియర్ స్థాయి ఉద్యోగులను కూడా కొత్తగా నియమించకుండా ఆపేయడం, డైరెక్ట్ నివేదికలు పెంచడం, జీతభత్యాల విధానాన్ని సమీక్షించడం వంటి చర్యలు తీసుకోనుంది.
Also Read: ఔరంగాజేబు సమాధి వివాదంలోకి చంద్రబాబును లాగిన ఉద్ధవ్.. సంచలన వ్యాఖ్యలు!