Amarnath Yatra 2026 :  జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర..ఎప్పటివరకంటే ?

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన యాత్రల్లో ఒకటిగా నిలుస్తోంది అమర్‌నాథ్‌ యాత్ర. అమరనాథ్‌లోని మంచు లింగంతో కూడిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏటా యాత్ర చేపడుతారు. ఈ  యాత్ర జులై 3వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.

New Update
FotoJet (42)

Amarnath Yatra 2026

Amarnath Yatra 2026 : ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన యాత్రల్లో ఒకటిగా నిలుస్తోంది అమర్‌నాథ్‌ యాత్ర. అమరనాథ్‌లోని మంచు లింగంతో కూడిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏటా యాత్ర చేపడుతారు. ఈ ఏడాది కూడా యాత్రకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ  యాత్ర జులై 3వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir) లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. ఆ రోజునుంచి 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 28వ తేదీన ముగుస్తుందన్నారు.

Also Read :  ఘోర ప్రమాదం: బస్సు-వ్యాన్ ఢీ, 13 మంది మృతి!

Amarnath Yatra From July 3rd 2026

హిందూవులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ యాత్ర హిమాలయ సానువుల్లో సాగుతుంది. అయితే అక్కడి వాతావరణం అన్ని సందర్భాల్లో ఒకే రీతిలో ఉండదు. అందుకోసం అమర్‌నాథ్‌ దర్శనానికి అనుకూలించే తేదీలను ప్రభుత్వం ప్రకటిస్తుంది.  ఖాళీ నడకన హిమాలయాల్లో ఉన్న అమర్‌నాథ్‌(Amarnath pilgrims) ను దర్శించుకోవడం సాహసంతో కూడిన ఈ యాత్రకు అమర్‌నాథ్ బోర్డు నిబంధనల ప్రకారం 13 లోపు వారిని 70 ఏళ్ల వయస్సు పైబడిన వారిని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

జులై 3వ తేదీ నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు సాగే  ఈ యాత్రకు ధరఖాస్తులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆదివారం జమ్మూలోని లోక్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విలేకర్లతో మాట్టాడారు. ఏప్రిల్ 15వ తేదీ ఆ యాత్రలో పాల్గొనేవారు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. జమ్మూ కశ్మీర్ బ్యాంకు, ఎస్‌బీఐ, ఎస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకులకు దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ముందస్తు దరఖాస్తుదారులు  నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

Also Read :  కేంద్రం సంచలన నిర్ణయం.. డీజిల్‌పై భారీగా సుంకాలు పెంపు

Advertisment
తాజా కథనాలు