/rtv/media/media_files/2025/03/26/IgMmI31zSnJvakiK4yZs.jpg)
Aishwarya Rai Bachchan
Aishwarya Rai Bachchan: బాలీవుడ్ అగ్ర నటి, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందన్న వార్తలతో భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ముంబైలోని ఐష్ ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టినట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అది చూసిన పలువురు అభిమానులు ఐశ్వర్యకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ సమయంలో ఐశ్వర్యా రాయ్ కారులో లేరని సమాచారం. పెద్ద ప్రమాదమేమీ చోటుచేసుకోలేదని ఐశ్వర్యా రాయ్ టీమ్ స్థానిక మీడియాకు వెల్లడించినట్టు తెలిసింది. ఐష్ సురక్షితంగానే ఉన్నారని.. ప్రమాద సమయంలో ఆమె కారులో లేరని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి.
బాలీవుడ్ షాదీ.కామ్ వెల్లడించిన వివరాల ప్రకారం..
ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత భద్రత సిబ్బంది కారులోనే ఉన్నారు. అయితే కారుకు ఎలాంటి నష్టం జరగలేదని, కాసేపటి తర్వాత ఐశ్వర్యరాయ్ కారు ఘటనాస్థలి నుంచి బయల్దేరిందని బాలీవుడ్ షాదీ తెలిపింది. ప్రమాద సమయంలో ఐశ్వర్యరాయ్ కారులో కనిపించలేదు. అయితే ప్రమాద విషయం తెలుసుకున్న ఐశ్వర్య అభిమానులు భయాందోళనకు గురయ్యారు. తమ అభిమాన నటి క్షేమంగానే ఉన్నారని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 5050 నెంబర్ గల ఐష్ కారు ముంబై వాసులకు సుపరిచితమే. హై ఎండ్ టయోటా వెల్‌ఫైర్ కారును ఐశ్వర్య వాడుతున్నారు. దీని ధర రూ.1.30 కోట్ల పైమాటే. వెంటిలేటెడ్ స్పెషల్ సీట్లతో , లగ్జరీ ఇంటీరియర్‌లకు ఈ కారు ఫేమస్. ఐష్‌తో పాటు బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు కూడా ఈ కారును వినియోగిస్తున్నారు.
Also Read: Komatireddy Rajagopal Reddy: మా రేవంత్ రెడ్డి చాలా మంచోడు...లేకుంటే....
మంగళవారం జరిగిన మరో ఘటనలో ప్రముఖ నటుడు, రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ సతీమణి సోనాలి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న వాహనం నాగపూర్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో సోనాలి అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Also Read: CM Revanth Reddy : రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు రావు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!