/rtv/media/media_files/2025/03/21/J57IuzLjxREzcFC8NDPi.jpg)
Air India flight
ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న విమానంలో విషాదం చోటుచేసుకుంది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎయిరిండియా విమానం ఢిల్లీ నుంచి బయలుదేరింది. శుక్రవారం ఉదయం 8.10 గంటలకు లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది.
Also Read: కర్ణాటకలో హనీట్రాప్ దుమారం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య
అయితే ప్రయాణికులు విమానం దిగే సమయంలో సిబ్బంది సీట్లు శుభ్రం చేస్తున్నారు. ఓ వ్యక్తి వద్దకు వెళ్లగా.. అతడు ఎలాంటి చలనం లేకుండా ఉన్నాడు. దీంతో వైద్యులు అతడికి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం అధికారులకు సమాచారం అందడంతో ఈ విషయం బయటపడింది. మృతుడు ఢిల్లీకి చెందిన ఆసిఫ్ ఉల్హా అన్సారీగా గుర్తించారు.
Also Read: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్
విమానం ఎక్కిన తర్వాత అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు కూడా అలానే ఉన్నాయి. సీటు బెల్ట్ కూడా తీయలేదు. దీంతో అతడు విమానం గాల్లో ఉండగానే మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అతడు మృతి చెందడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని.. రిపోర్టులు వస్తే గాని చెప్పలేమన్నారు. అలాగే అతడి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
Also Read: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం!
rtv-news | national-news | air india