16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం..

16 ఏళ్ల తర్వాత ఓ కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం.. ఆ కానిస్టేబుల్ కొడుకుకి ఆరు వారాల్లోగా ప్రభుత్వం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
Supreme Court 3

16 ఏళ్ల తర్వాత ఓ కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం.. ఆ కానిస్టేబుల్ కొడుకుకి ఆరు వారాల్లోగా ప్రభుత్వం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని అలీఘర్‌లో శిశుపాల్ సింగ్ అనే వ్యక్తి రాష్ట్ర పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్‌గా విధులు నిర్వహించేవాడు. అయితే ఆయన 1992లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత అనారోగ్యానికి గురై 1995లో మృతి చెందాడు. ఆ సమయంలో శిశుపాల్ సింగ్ కొడుకు వీరేంద్ర పాల్‌ సింగ్ మైనర్. దీంతో అతని తల్లి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేకపోయింది.  

Also Read: ప్రధాని మోదీని చంపుతామంటూ.. ముంబాయి పోలీసులకు బెదిరింపు కాల్స్..

అయితే 13 ఏళ్ల తర్వాత వీరేంద్ర పాల్ మేజర్ అయ్యాడు. ఈ క్రమంలో 2008లో అతడు కారుణ్య నియామకం కోసం ప్రభుత్వానికి అప్లై చేసుకున్నాడు. ఇలా దరఖాస్తు చేసుకోవడంలో ఆలస్యం జరగడం వల్ల యూపీ సర్కార్ అతడి అప్లికేషన్‌ను తిరస్కరించింది. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీరేంద్రపాల్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ అంశంపై మళ్లీ విచారణ జరపాలని హైకోర్టు సింగల్ బెంచ్‌ యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అంశంపై పునరాలోచన చేసిన యూపీ ప్రభుత్వం ఆ తర్వాత దీన్ని తిరస్కరించింది.  

ఇది కూడా చదవండి: భారత్‌కు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది.. ఏం చేశాడంటే

Supreme Court - Constable

కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జరిగిన ఆలస్యంపై క్షమించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. దీంతో ఇలా హైకోర్టులోనే వాదప్రతివాదనల వల్ల చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. 2021లో అలహాబాద్ హైకోర్టు సింగ్‌ బెంచ్‌.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. నాలుగు నెలల్లోగా వీరేంద్రకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే దానిపై పరిశీలన చేయాలని సూచించింది. అయితే యూపీ ప్రభుత్వం.. ఈ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. కానీ 2022లో అది తిరస్కరణకు గురైంది. అతడి కారుణ్య నియామకాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందేనని ఆదేశించింది.  

ఇది కూడా చదవండి: యువతి ప్రాణం తీసిన పల్లీలు.. అసలేమైందంటే?

దీంతో యూపీ సర్కార్.. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ను సవాల్ చేసింది. అయితే యూపీ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీసుకున్న నిర్ణయంలో తమకు ఎక్కడా లోపం కనిపించలేదని చెప్పింది. ఆరు వారాల వ్యవధిలోనే వీరేంద్రపాల్‌ సింగ్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తానికి 16 ఏళ్ల తర్వాత ఆ కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం జరిగింది.

Also Read :  ఇథనాల్ కంపెనీలో కొడుకుకు వాటా.. అది వాస్తవమేనన్న తలసాని శ్రీనివాస్!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nitish Kumar: డిప్యూటీ ప్రధానిగా నితీశ్‌ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను తాను ఉప ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాని బీజేపీ సీనియర్ నేత అశ్వినీ కుమార్ చౌబే అన్నారు. ఎన్డీయే ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ పదవి ఇవ్వాలన్నారు. దీంతో నితీశ్‌ ఉప ప్రధాని అవుతారా అనే వార్తలు చర్చనీయాంశవుతున్నాయి.

New Update
Nitish Kumar

Nitish Kumar

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఉప ప్రధాని అవుతారా అనే వార్తలు చర్చనీయాంశవుతున్నాయి. దీనికి కారణం బీజేసీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలే. మాజీ కేంద్రమంత్రి అయిన అశ్వినీ కుమార్ చౌబే తాజాగా మీడియాతో మాట్లాడారు.  జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను తాను ఉప ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాని తెలిపారు. '' NDAకు నితీశ్‌ కుమార్ ఎంతో సేవ చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి ఆయనకు డిప్యూటీ పీఎం పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. 

Also Read: రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

ఇలాంటిది జరిగిదే బీహార్‌ నుంచి ఆ స్థానానికి చేరిన రెండో వ్యక్తిగా నితీశ్‌ కుమార్‌ నిలుస్తారని'' అశ్వినీ కుమార్ చౌబే అన్నారు. అయితే గతంలో బీహార్‌ నుంచి ఉప ప్రధానమంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ పనిచేశారు.  ఇదిలాఉండగా ఈ ఏడాది చివర్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నీతిశ్ ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా నితీశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సీఎం పదవిపై ఆశతో ఆయన మళ్లీ కూటమి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. 

Also Read: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి

ప్రస్తుతం బీహార్‌ రాజకీయాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉంది. దీంతో ఆ పార్టీ నితీశ్ కుమార్‌ను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నితీశ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ ఆసక్తి చూపించడం లేదని ఇటీవల ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య బీజేపీ నేత తాను నితిశ్‌ కుమార్‌ను డిప్యూటీ పీఎంగా చూడాలనుకుంటున్నాని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షం.. ఈదరు గాలులతో హైదరాబాద్‌ అతలాకుతలం

Advertisment
Advertisment
Advertisment