/rtv/media/media_files/2025/02/24/319JfR1jaFVOWDYXNOnk.jpg)
madras
తమిళ దర్శక నటుడు, నామ్ తమిళర్ కట్చిప్రధాన సమన్వయకర్త సీమాన్‌పై నటి విజయలక్ష్మి ఫైల్ చేసిన లైంగిక వేధింపుల కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకుంటానని బాధితురాలిని సీమాన్ మోసం చేశాడని, దీంతో ఆమెకు ఏడుసార్లు అబార్షన్ జరిగిందని వివరించింది. సీమాన్‌పై కేసు తీవ్రమైందని, దీనిని కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది.
లైంగిక వేధింపులకి గురిచేసినట్లు నటుడు సీమాన్‌పై నటి విజయలక్ష్మి చేసిన ఫిర్యాదు ఆధారంగా 2011లో తమిళనాడు పోలీసులు కేసు ఫైల్ చేశారు.అయితే, ఈ కేసును రద్దుచేయాలని కోరుతూ సీమాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇళంతిరైయన్ ఈ నెల 17న తీర్పు ప్రకటించారు.
Also Read: Horoscope: నేడు ఈ రాశివారు చెప్పుడు మాటలకు దూరంగా ఉంటే మంచిది!
కేసు రద్దు చేయడం కుదరదని, 12 వారాల్లోగా తుది నివేదికను తమకు సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు సీమాన్ పిటిషన్‌ని న్యాయమూర్తి కొట్టేశారు. నటుడు, దర్శకుడు అయిన సీమాన్.. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. సీమాన్ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో విజయలక్ష్మి నటించారని, ఆ పరిచయం కారణంగా తన కుటుంబసమస్యల పరిష్కారానికి అతడ్ని ఆమె సంప్రదించారని న్యాయమూర్తి అన్నారు.
ప్లేటు ఫిరాయించి...
ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, తర్వాత ప్లేటు ఫిరాయించి బెదిరింపులకి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే, ఇరువురి ఆమోదంతో జరిగింది లైంగికచర్య నేరం కాదని, విజయలక్ష్మి తనపై కేసును 2012లో వెనక్కి తీసుకున్నట్లు సీమాన్ వాదించారన్నారు. అయితే, తనను వివాహం చేసుకుంటానని అందరి ముందు ఇచ్చిన హామీని నమ్మి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు విజయలక్ష్మి తిరువళ్లూర్ మహిళా కోర్టులో వాగ్మూలం ఇచ్చినట్టు గుర్తించామని న్యాయమూర్తి తెలిపారు.
అంతేకాదు, ఫిర్యాదును వెనక్కితీసుకుంటున్నట్టు లాయర్‌కు ఆమె ఇచ్చిన లేఖ సంబంధిత పోలీసు అధికారికి చేరలేదని, దీంతో ఆ కేసు పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో 15 మంది వాగ్మూలాలను నమోదుచేసినట్టు ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారని, ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదని జస్టిస్ ఇళంతిరైయన్ అభిప్రాయపడ్డారు. అతడి కారణంగా బాధితురాలు సుమారు 7 సార్లు గర్బం దాల్చి.. అబార్షన్ చేయించుకున్నారని విచారణలో తెలిసిందన్నారు. అంతేకాదు, నటి విజయలక్ష్మి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కూడా తీసుకుని.. ఆమెను బెదిరింపులకు గురిచేసి ఫిర్యాదుని వెనక్కి తీసుకునేలా ఒడిగట్టారని తెలిపారు.
సీమాన్‌పై లైంగిక ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ఫిర్యాదు వెనక్కి తీసుకున్నప్పటికీ రాజీ చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పారు. 2023 వరకు ఇద్దరి మధ్య ఏదో ఒకరకంగా సంబంధం ఉందని, కాబట్టి లైంగిక వేధింపుల కేసు కొట్టేయడం కుదరదని న్యాయమూర్తి తన ఉత్తర్వులో పేర్కొన్నారు.
Also Read: Hezbollah-Nasralla: నసల్లా అంత్యక్రియలు..జనసంద్రంగా మారిన రోడ్లు..!
Also Read: Slbc Tunnel Accident: ఆ 8 మంది ఎక్కడ...ఎలా ఉన్నారో...సవాల్ గా మారిన సహాయక చర్యలు!