పార్లమెంట్‌లో 2025 బడ్జెట్ ప్రవేశపెడుట్టనున్నారు. ఇందులో వేటికి ఎక్కువ కేటాయింపులు ఉంటాయి..? ఇన్‌కమ్ ట్యాక్స్ తగ్గుతుందా? ప్రజాకర్షక పథకాలకు పెద్ద పీఠ వేస్తారా? పేద, మధ్యతరగది కుటుంబాలు 2025 బడ్జెట్ కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే.. 2025 బడ్జెట్‌తో అందరికీ మంచి జరుగుతుందని కేంద్రం ఊరిస్తోంది. నిజానికి ప్రజలు కూడా అలానే భావిస్తున్నారు. త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున.. అంతే కాదు గతేడాది పెంచిన పన్నుల భారంతో ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
Read also ; Budget 2025: బడ్జెట్ ప్రవేశపెట్టడంలో నిర్మలా సీతారామన్ రికార్డు..
ప్రతిపక్షాలకు కూడా ఈ పన్నుల విధానం ఓ విమర్శన అస్త్రంగా మారింది. దీన్ని తిప్పి కొట్టాలంటే బీజేపీ బడ్జెట్ 2025 మ్యాజిక్ చేయాలి. ఆ మ్యాజిక్ జరుగుతుందనే ఆర్థికవేత్తలు, పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్, నిపుణులు చర్చించుకుంటున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం మాట్లాడుతూ.. తనకు సొంతిల్లు లేదని, కానీ.. సొంతఇల్లు అనేది ప్రతి పేదవాడి కల అని అన్నారు. దీంతోపాటు అనే విషయాలు ఆయన మాట్లాడారు. అవి పన్ను విధానంలో సామాన్యుడికి రిలీఫ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ద్వారాకాలో బీజేపీ ప్రచారానికి హాజరైయ్యారు.
#DelhiElection2025 | Prime Minister Narendra Modi addresses a public meeting in Delhi's Dwarka area
— ANI (@ANI) January 31, 2025
He says, "Dil walo ki Dilli ne thaan liya hai, AAP-da walo ko bhagana hain, iss baar BJP sarkar banana hain..." pic.twitter.com/TQrqCUAC2m
Also Read: రాష్ట్రపతి అలసిపోయారన్న సోనియా గాంధీ.. బీజేపీ ఫైర్
గతేడాది జీడీపీ వృద్ధి రేటు క్షీణించింది. దీంతో ఈసారి పన్నుల మినహాయింపు ఉంటుందని అందరూ ఆశపడుతున్నారు. ఇన్‌కం ట్యా్క్స్ శ్లాబ్ సవరణ, స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, రిబేట్ పెంపు వంచి అంశాలపై ఉద్యోగులు ఆశలుపెట్టుకున్నారు. ఫ్రీ రేషన్, పీఎంఏవై, జాతీయ ఉపాధి హామి పథకం వంటి పథకాలు అమలు అవుతున్నాయి. వీటికి కేటాయింపులు పెంచడంతోపాటు సామాజిక భద్రత మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే మహిళా సాధికారిత కోసం కూడా బీజేపీ ప్రభుత్వం ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తోందని అంచనా. మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్, జన్‌ధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాలు కేటాయింపులు పెంపు వంటివి ఉంటాయని అంచనా. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువు ఈ మార్చితో ముగియనుండటంతో దాన్ని కొనసాగించడం లేదా దాని ప్లేస్ లో మరో పథకం తీసుకురావడం వంటివి జరగొచ్చని అనుకుంటున్నారు.