భర్త టార్చర్ తట్టుకోలేక లోన్ రికవరీ ఏజెంట్‌తో లేచిపోయిన భార్య

తాగుబోతు భర్త వేధింపులు భరించలేక భార్య లోన్ రికవరీ ఏజెంట్‌తో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన బీహార్‌లోని జముయ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 11న త్రిపురారి ఘాట్ సమీపంలోని ఆలయంలో హిందూ ఆచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

New Update
women marriage lone agenty

women marriage lone agenty Photograph: (women marriage lone agenty)

బహుశా విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో.. తాగుబోతు భర్త వేధింపులు భరించలేక భార్య లోన్ రికవరీ ఏజెంట్‌తో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన బీహార్‌లోని జముయ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తాగుబోతు భర్త వేధింపులపై అతడి భార్య విసిగిపోయింది. లోన్‌ రికవరీ కోసం గ్రామానికి వచ్చిన ఏజెంట్‌తో పరిచయం పెంచుకున్నది. చివరకు అతడితో కలిసి పారిపోయి పెళ్లాడింది. ఇందిరకు పెళ్లై ఏడాదిన్నర అయ్యింది. 

Also Read : అరే X ఏంట్రా ఇది.. ట్రంప్ ముందే మస్క్‌తో మజాకానా..?

జాజల్ గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి పవన్ కుమార్ రుణాల రికవరీ కోసం పలు గ్రామాలను సందర్శించేవాడు. ఈ క్రమంలో కొన్ని నెలల కిందట కర్మ టాండ్ గ్రామానికి చెందిన ఇందిరా కుమారిని అతడు కలిశాడు. ఆ తర్వాత వారిద్దరూ ఫోన్‌ నెంబర్లు మార్చుకున్నారు. తరుచూ మాట్లాడుకునే వారు ఇలా వారి పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య సంబంధం మరింతగా బలపడింది. ఇందిర తన భర్తను వదిలి పవన్‌తో వెళ్లిపోయింది. ఫిబ్రవరి 11న త్రిపురారి ఘాట్ సమీపంలోని ఆలయంలో హిందూ ఆచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Also Read :  నన్ను వాడు చంపేస్తాడు..లక్ష్మీ సంచలన వీడియో విడుదల

తన భర్త తాగి వచ్చి తనను కొట్టేవాడని, శారీరకంగా వేధించేవాడని ఇందిర ఆరోపించింది. తాగుబోతు భర్తతో విసిపోవడంతోపాటు అతడి హింసను భరించలేక పరిచమైన పవన్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. దీంతో తన జీవితాన్ని అతడితో గడుపుతానని చెప్పగా పవన్‌ ఒప్పుకోవడంతో తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. వారి పెళ్లి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు