BREAKING: లోయలో పడ్డ వాహనం.. స్పాట్‌లో 8 మంది మృతి

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు.

New Update
8 Killed, 2 Injured As Vehicle Falls Into Gorge In Uttarakhand's Chamba

8 Killed, 2 Injured As Vehicle Falls Into Gorge In Uttarakhand's Chamba

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఘన్సాలిలోని త్యోల్ధర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అంత్యక్రియల కోసం హరిద్వార్‌కు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత 10 మంది గ్రామస్థులు తిరిగి బోలెరో వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే చంబా అనే ప్రాంతంలో ఘాట్‌ రోడ్డుపై ప్రమాదం జరిగింది.

Also Read: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్

 డ్రైవర్‌ కంట్రోల్ తప్పడంతో వాహనం లోయలో పడిపోయింది. వాహనం పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. లోయలో పడ్డ 8 మృతదేహాలను బయటికి తీశారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

Also Read: అంబులెన్స్‌లో రొమాన్స్.. ఓయో రూమ్‌లా వాడేసుకున్న యువతీ యువకులు..

మరోవైపు ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా యంత్రంగాన్ని ఆదేశించారు. అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తూ అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Advertisment
తాజా కథనాలు