Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్‌ ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో 8 మంది మృతిచెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
BUSS2

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక వివరాల్లోకి వెళ్తే కన్నౌజ్ జిల్లా కరవ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్‌ ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో 8 మంది చనిపోయినట్లు ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు.   

Also Read: ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు.. కలెక్షన్స్ లో చరిత్ర సృష్టించిన 'పుష్ప2'

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు జలవనరులు శాఖ మంత్రి స్వతంత్ర దేవ్‌సింగ్ సహాయక చర్యలు చేపట్టి ప్రమాద బాధితులకు తక్షణమే వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు.

Also Read: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

ఇదిలాఉండగా.. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరి గేటు వద్ద ఓ లారీ అదుపుతప్పి కూరగాయలు విక్రయించే వ్యాపారులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది వ్యాపారులు మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.   

Also Read: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1785 ఖాళీలు..అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే!

Also Read:  విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

టీవీకే అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే.

New Update
TVK Chief Vijay

TVK Chief Vijay

క్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ముస్లింలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే. తాజాగా విజయ్ కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

 ఇదిలాఉండగా.. వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలలైన పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై ఇప్పటిదాకా 10 పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు జాబితా కావాల్సి ఉంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన బెంచ్ విచారణ చేయనుంది. 

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ముందుగా ఏప్రిల్ 15న విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం చెప్పగా.. కేంద్రం గత మంగళవారం కేవియట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని తెలిపింది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చిన పిటిషన్లను ఏప్రిల్ 16న విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతితో ఈ చట్టం అమల్లోకి కూడా వచ్చింది.  

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

rtv-news | waqf-amendment-bill | national-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment