Congress: మాకు మంత్రి పదవులు కావాల్సిందే.. ఢిల్లీకి 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం మొదలైంది. పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు.

New Update
30 Congress MLAs head to Delhi to meet the high command for cabinet reshuffle in karnataka

30 Congress MLAs head to Delhi to meet the high command for cabinet reshuffle in karnataka

కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం మొదలైంది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌ మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసేందుకు 30 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరారు.    

 ఢిల్లీకి పయనమయ్యే ముందు ఎమ్మెల్యే గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తాము చాలాసార్లు సమావేశమైనట్లు తెలిపారు. మంత్రివర్గంలో స్థానం కల్పించేలా ఒత్తిడి పెంచేందుకు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది నేతలు నాలుగైదుసార్లు అవకాశాలిచ్చారని.. ఈసారి కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు.  

Also read: దేశంలో ఉగ్రవాదులకు పాస్ పోర్టులు, ఆధార్‌లు.. వెలుగులోకి సంచలన నిజాలు

మరో ఎమ్మెల్యే అశోక్‌ పట్టన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మిళిత నాయకత్వం కోసం తాము ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపట్టి మాలాంటి నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఇతరులకు మంత్రి పదవులు ఇస్తామని సీఎం సిద్ధరామయ్య గతంలో హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే ముడేళ్లు అయ్యిందని కానీ ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వాపోయారు. 

పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేత్ పాటు ఇతర కీలక నేతలు వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలను కూడా కలిసేందుకు యత్నిస్తామని అశోక్‌ పట్టన్ తెలిపారు. అయితే తాము చేస్తున్న డిమాండ్‌లో ఎలాంటి వివాదం లేదని హైకమాండ్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. మొత్తానికి తమకు మంత్రివర్గంలో 25 బెర్త్‌లు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పదవుల కోసం పాకులాడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.  

Also Read: మాజీ జవాన్ చదువుల యుద్ధం.. 138 డిగ్రీలతో ప్రపంచ రికార్డులు!

Advertisment
తాజా కథనాలు